లేడీ కమెడియన్ భారీ చేంజ్

0

తెలుగు మరియు తమిళంలో హీరోయిన్ పక్కన లేదంటే హీరో పక్కన కమెడియన్ గా ఎన్నో చిత్రాల్లో కనిపించిన నటి విధ్యురామన్. నటిగా ఎంతో బిజీగా ఉన్న ఈ అమ్మడు గత మూడు నెలలుగా షూటింగ్స్ లేకపోవడంతో తన బరువును తగ్గించుకునేందుకు గట్టి ప్రయత్నమే చేసినట్లుగా ఉంది. తాజాగా విధ్యురామన్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ గ్యాప్ లో ఈమె చాలా బరువు తగ్గి స్లిమ్ గా అయ్యింది.పాత ఫొటో కొత్త ఫొటో రెండు పక్క పక్కన పెట్టి ఈమె చేసిన పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బరువు తగ్గిన విధ్యురామన్ ఏకంగా హీరోయిన్ లా ఉందంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే మరికొందరు కష్టపడి బరువు తగ్గినందుకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇన్ స్టా గ్రామ్ లో విధ్యురామన్ ఈ ఫొటోను షేర్ చేయడంతో పాటు.. గతంలో నేను ఎక్కువ బరువు ఉన్న సమయంలో చాలా మంది నన్ను ఎలా నువ్వు ఇంత కాన్ఫిడెన్స్ గా ఉంటావు అంటూ ప్రశ్నించేవారు.

నాకు నేను బలంగా నమ్మడం వల్ల ఇప్పుడు ఈ స్థితిలో కనిపిస్తున్నాను. నా ఆహారపు అలవాట్లు మరియు నా రోజు వారి కార్యక్రమాలు చాలా వరకు మార్చుకున్న కారణంగానే నేను బరువు తగ్గానంటూ పోస్ట్ చేసింది. మొత్తానికి భారీగా బరువు తగ్గడంతో కొత్త లుక్ లో విధ్యురామన్ విభిన్నంగా కనిపిస్తుందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Please Read Disclaimer