పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన మన ఎనిమిది మంది స్టార్ హీరోయిన్స్

0

సినిమా పరిశ్రమలో ప్రేమలు.. డేటింగ్ లు.. సహజీవనం చేయడం చాలా కామన్ గా వస్తుంది. ఇది ఈమద్య ఆరంభం అయినది కాదు. చాలా సంవత్సరాలుగా సినిమా పరిశ్రమలో ముఖ్యంగా బాలీవుడ్ లో కొనసాగుతూనే ఉంది. పలువురు హీరోయిన్స్ పెళ్లికి ముందే లివింగ్ రిలేషన్ షిప్ లో ఉంటూ ప్రెగ్నెంట్ అయిన దాఖలాలు ఉన్నాయి. పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయితే ఎక్కువ శాతం వద్దనుకుంటారు. కాని కొందరు హీరోయిన్స్ మాత్రం పెళ్లికి ముందే వచ్చిన ప్రెగ్నెన్సీని కొనసాగించి పిల్లలకు జన్మనిచ్చారు. ఇప్పుడు ఆ స్టార్స్ ఎవరో మనం ఇప్పుడు చూద్దాం.

1. ఇండియన్ సినిమా లెజెండ్రీ హీరోయిన్ గా.. అతి లోకసుందరిగా పేరు దక్కించుకున్న శ్రీదేవి బోనీకపూర్ ను వివాహం చేసుకోక ముందే ప్రెగ్నెంట్ అయ్యిందంటూ పెళ్లి సమయంలో మీడియాలో వార్తలు వచ్చాయి. బోనీకపూర్ తో పెళ్లి సమయంలో శ్రీదేవి ఏడు నెలల గర్బవతి అంటూ ప్రచారం జరిగింది. ఆ విషయాన్ని అప్పట్లో శ్రీదేవి దంపతులు అధికారికంగా ప్రకటించకున్నా పెళ్లి అయిన మూడు నెలల్లోనే జాన్వీ కపూర్ కు శ్రీదేవి జన్మనిచ్చింది.

2. హీరోయిన్ సారిక కూడా పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయ్యింది. యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ తో ఈమె చాలా సంవత్సరాల పాటు ప్రేమాయణం సాగించింది. ఆ సమయంలో వీరిద్దరు సహజీవనం కూడా సాగించారు. అప్పుడే సారిక ప్రెగ్నెంట్ అయ్యింది. దాంతో వెంటనే సారిక.. కమల్ హాసన్ లు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి సమయంలో శృతి హాసన్ ను సారిక తన గర్బంలో మోస్తూ ఉండగా పెళ్లి తర్వాత వీరికి అక్షర హాసన్ జన్మించింది.

3. హీరోయిన్ రేణు దేశాయ్ కూడా పవన్ కళ్యాణ్ తో వివాహంకు ముందే అకీరాకు జన్మనిచ్చిన విషయం తెల్సిందే. కొడుకు ఒడిలో ఉండగా రేణు దేశాయ్ పెళ్లి అయ్యింది. పెళ్లి తర్వాత పవన్.. రేణు లకు పాప జన్మించింది.

4. పెళ్లికి ముందు గర్భం దాల్చిన హీరోయిన్స్ లో మహిమ చౌదరి ఒకరు. ఈమె బాబీ ముఖర్జీని 2006వ సంవత్సరంలో వివాహం చేసుకుంది. అప్పటికే ఈమె గర్బవతి అవ్వడం వల్ల వివాహంను రహస్యంగా చేసుకుంది. ప్రెగ్నెన్సీని ఎంత రహస్యంగా ఉంచినా కూడా డెలవరీ సమయంకు ఆ విషయం బయట పడింది.

5. ఈ జాబితాలో ఉన్న మరో హీరోయిన్ అమృత అరోరా. ఈమె షకీల్ లడక్ను వివాహం చేసుకుంది. అప్పటి వరకు ప్రేమలో ఉన్న వీరిద్దరు హడావుడిగా.. ఆర్భాటం లేకుండా వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత అమృత అరోరా ప్రెగ్నెంట్ అని వెళ్లడయ్యింది. అందుకే హడావుడి మ్యారేజ్ అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి.

6. బాలీవుడ్ ప్రేక్షకులకు మరియు బుల్లి తెర ప్రేక్షకులకు సుపరిచితురాలైన నేహా దుపియా కూడా పెళ్లికి ముందే గర్బందాల్చింది. అంగద్ బేడీతో పెళ్లికి ముందు ఆయన బిడ్డను నేహా కడుపులో మోసింది. తల్లిదండ్రులకు చెప్పేందుకు భయపడి వారు ప్రెగ్నెంట్ అని తెలియగానే వివాహం చేసుకున్నట్లుగా సమాచారం.

7. సీనియర్ హీరోయిన్ నైనా గుప్తా కూడా పెళ్లికి ముందే తల్లి అయ్యింది. ఈమె చాలా కాలం వివియన్ రిచర్డ్స్ తో డేటింగ్ లో ఉంది. నైనా పెళ్లి సమయానికి ఒక బేబీని కలిగి ఉన్న సంగతి అందరికి తెల్సిందే.

8. బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కొంకన సేన్ శర్మ కూడా వివాహానికి ముందే గర్బవతి అయ్యింది. రన్ వీర్ శౌరీతో రహస్య వ్యవహారం సాగించింది. చాలా కాలం పాటు ఆ వ్యవహారం కొనసాగిన నేపథ్యంలో కొంకన సేన్ శర్మ గర్బవతి అయ్యింది. వీరిద్దరు పెళ్లికి ముందే ఒక బేబీని కూడా కలిగి ఉన్నారు.

వీరు మాత్రమే కాకుండా ఇంకా పలువురు హీరోయిన్స్ కూడా పెళ్లికి ముందే గర్బవతులు అయ్యారు. కొందరు మ్యానేజ్ చేస్తే మరికొందరు మాత్రం రహస్యంగా ఉంచేందుకు ప్రయత్నించారు. అయితే ఎక్కువ శాతం ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్స్ వెంటనే పెళ్లి చేసుకున్నారు. ముందు ముందు ఇలాంటివి ఎన్ని చూడాల్సి వస్తుందో..!
Please Read Disclaimer