తన్మయత్వంలో బికినీ బ్యూటీ

0

యామిని భాస్కర్ పేరు తెలుసా? ఎన్టీఆర్ చిత్రం ‘రభస’ లో ఒక కీలక పాత్ర పోషించిన ఈ భామ నూకరాజు హీరోగా నటించిన ‘భలే మంచి చౌక బేరం’ లో హీరోయిన్ గా నటించింది. ‘కొత్తగా మా ప్రయాణం’ అనే మరో చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించింది. ఈ భామ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న గ్లామర్ ఉద్యమానికి తనదైన తోడ్పాటు అందిస్తూ ఉంటుంది.

తన హాట్ ట్రెండ్ ను కొనసాగిస్తూ తాజాగా రెండు ఫోటోలను ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేసింది. ఈ ఫోటోలకు ‘సూర్యకాంతిలో మునిగిపోండి’ అంటూ ఒక క్యాప్షన్ ఇచ్చింది. యామిని చెప్పింది కదా అనే ఎర్రటి ఎండలో చొక్కాలు విప్పి నిలుచుంటే మలమలా మాడి కాకిలా అయిపోయడం ఖాయం. కాబట్టి అలాంటివి దయచేసి చేయకండి. యామిని ఈతకొలనులో జలకాలాడుతూ సూర్య కిరణాలను అస్వాదిస్తోంది. తనలా మిమ్మల్ని కూడా కూల్ గా స్విమ్ చేస్తూ నులివెచ్చగా ఉండే భానుడి కిరణాలను ఆస్వాదించమని చెప్తోందని మనం అర్థం చేసుకోవాలి. మోనోకిని ధరించిన యామినీ ఒక ఫోటోలో ఈతకొలను గట్టుపై కళ్ళు మూసుకొని తన్మయత్వంలో ఉంది. మరో ఫోటోలో నీటిలో జలకాలడుతూనే తన్మయత్వంలో ఉంది. బికినీ కాబట్టి హాట్ నెస్ ఆటోమేటిక్ గా వచ్చేసింది.

యామిని మరీ ఫేమస్ బ్యూటీ కాదు కాబట్టి లైక్స్ తక్కువే.. కామెంట్లు కూడా తక్కువే. అయినప్పటికి ఇలాంటి అరుదైన అందాలను గుర్తించే కళాపోషకులకు మన సామాజిక మాధ్యమాల్లో.. సామాజిక న్యాయం పాటించే సమసమాజంలో లోటేమీ లేదు. అలాంటివారు రెచ్చి పోయి కామెంట్లు పెట్టారు. “స్టన్నింగ్ బ్యూటీ”.. “ఈసారి మంచి క్లారిటీ ఉండే ఫోటోలు పెట్టు”.. ‘వెరీ వెరీ హాట్’.. ‘ఈతకొలను ధ్యానం’ అంటూ తమ స్పందనను తెలిపారు.
Please Read Disclaimer