ఆ టాప్ బ్రాండ్ పిచ్చేమిటబ్బా?

0

సెలబ్రిటీ వరల్డ్ లో షో స్టాపర్ గా నిలవడం చాలా ఇంపార్టెంట్. నేటి ట్రెండ్ కి తగ్గట్టు స్టైలిష్ గా ఉండటం సహజం. సెలబ్ జీవితమే ఖరీదైనది. షూకు వేసే ఫాలిస్ నుంచి తలకు రాసే రంగు వరకూ అన్నీ ఖరీదైనవే. డిజైనర్ డ్రెస్ లు.. డిజైనర్ హ్యాండ్ బ్యాగులు.. డిజైనర్ లుక్ వగైరా వగైరా బోలెడంత హంగామా తప్పదు. నలుగురు వేరు.. మనం వేరు అని చూపించాలంటే ఆ మాత్రం మెయింటనెన్స్ చేయక తప్పదు. సెలబ్రిటీలు అన్నాక అవన్నీ కామన్. బేసిక్ గా మోడలింగ్ రంగం నుంచి వచ్చిన భామల్లో ఇంకాస్త స్టైలిష్ గా ఎలివేట్ అవ్వడానికి ఇష్టపడుతుంటారు. దక్షిణాది భామల్లా సింపుల్ గా చీర..పంజాబీ డ్రెస్ లు చుట్టేసుకుని రావడానికి ఉత్తరాది భామలు అస్సలు ఒప్పకోరు. వాళ్లకంటూ ఓ స్టైల్ ..మార్క్ ఉందని సందర్భం వచ్చిన ప్రతీసారి చేసి చూపిస్తుంటారు.

తాజాగా కొంత మంది బాలీవుడ్ భామల ఎయిర్ పోర్ట్ లుక్ ని దగ్గరగా స్టడీ చేస్తే …. ఆ సోయగాలు ఎంత స్టైలిష్ గా ఉన్నారో అర్ధమవుతోంది. వీళ్లంతా ఎంత స్టైలిష్ గా తయారై ఎయిర్ పోర్టులో హల్ చల్ చేస్తున్నారో ఈ ఫోటోలను బట్టే తెలుస్తోంది. సీనియర్ హీరోయిన్ మలైకా అరోరా ఎయిర్ పోర్టులో తనదైన హాట్ లుక్ తో ఆకట్టుకుంది. తెలుపు…నలుపు సారల నిక్కరు ప్యాంట్ ధరించి… వైట్ టైట్ టాప్ దానికి తగ్గ ఫిట్ బనియన్… ఆపైన తెల్లచొక్కా ధరించింది. మ్యాచింగ్ గా ఫ్యాంట్ కలర్ హ్యాండ్ బ్యాగ్ తగిలించింది. అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ టాప్ టు బాటమ్ అంతా టైట్ ఫిట్ వస్త్రాలే ధరించింది. రెడ్ కలర్ ప్యాంట్.. టాప్ లో అంతకు మంచి స్కిన్ టైట్ దుస్తులు ధరించి చూపరులను ఆకట్టుకుంది. ఇది ఎయిర్ పోర్టు నుంచి రిలీజైన పిక్.

ఇక ఆలియా భట్ సింపుల్ వేర్స్ లో దర్శనమిచ్చింది. నైట్ ప్యాంట్ నాచురంగు లోపలి బినయన్.. దాన్ని కవర్ చేస్తూ ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసింది. మరో వైపు కంగనా రనౌత్ బ్లూ కలర్ లూజు జీన్ ప్యాంట్ వేసింది. టాప్ లో సింపుల్ గా అంతే లూజుగా ఉండే ఫుల్ హ్యాండ్స్ వైట్ కలర్ షర్ట్ వేసుకుంది. ఇక అమ్మడి చెప్పులు మాత్రం హైలైట్. నిగనిగలాడే ఆ కాళ్ల అందాల నడుమ ఎత్తు మడాల చెప్పులకే అందం వచ్చింది. అక్కినేని కోడలు సమంత కూడా స్టైలిష్ గా కనిపించడానికి ఇష్టపడుతుంటుంది. విదేశీ పర్యటనలు వెళ్లినప్పుడు పెళ్లైన విషయం సైతం మర్చిపోయి ఎంతలా? హాట్ హాట్ గా హడావుడి చేస్తుందో తెలిసిందే. తాజాగా సమంత కూడా ఎయిర్ పోర్ట్ లో డిజైన్ వేర్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఒక పక్క జబ్బ కనిపించేలా…మరో పక్క చేయి మొత్తం మునిగిపోయేలా వైట్ కలర్ డిజైన్ వేర్ ధరించింది. హ్యాండ్ బ్యాగ్ మాత్రం మలైకా ఆరోరా వాడుతోన్న డిజైన్ లోనే ఉంది. వీళ్లంతా ఒక కామన్ బ్రాండ్ మాత్రం హ్యాండ్ బ్యాగ్ గా ఉపయోగించడం కనిపిస్తోంది. ఆ కంపెనీ పేరు హాఫ్ – వైట్. కేవలం సెలబ్రిటీ రేంజ్ మాత్రమే ఈ బ్రాండ్ ని కొనుక్కోగలరు. అందుకోసం లక్షల్లో వెచ్చించే ధీమా వాళ్లకు కాక ఇంకెవరికి ఉంటుంది?
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-