AD రెవెన్యూ: మహేష్ ఫ్యామిలీకీ భారీ ప్యాకేజ్

0

సకుటుంబ సపరివార సమేతంగా మహేష్ వాణిజ్య ప్రకటనల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీకి మహేష్ – నమ్రత సహా కిడ్స్ గౌతమ్-సితార అంతా ఒకే ఫ్రేమ్ లో కనిపించి ప్రచారం చేశారు. ఆ ప్రకటన ఇప్పటికే సోషల్ మీడియాల్లో వైరల్ అయ్యింది. దీనికి మహేష్ అభిమానుల నుంచి అద్భుత స్పందన వచ్చింది. ప్రీమియం క్లాస్ .. హై క్లాస్ రేంజ్.. సెలబ్ రేంజు బిజినెస్ కి సంబంధించిన పబ్లిసిటీ ఇదని చెప్పొచ్చు.

అయితే అందుకు తగ్గట్టే మహేష్ ఫ్యామిలీకి భారీ ప్యాకేజ్ ముట్టిందని తాజాగా ప్రచారం అవుతోంది. కేవలం కొన్ని నిమిషాల నిడివి ఉన్న ఈ ప్రకటన కోసం మహేష్ కుటుంబం అందుకుంటున్న మొత్తం ఐదు కోట్లు. అయితే ఇది అధికారికంగా ఎవరూ చెప్పకపోయినా ఫ్యాన్స్ లో ఈ తరహా టాక్ వినిపిస్తోంది.

ఫోర్బ్స్ జాబితా రాకుమారుడిగా.. సూపర్ స్టార్ గా మహేష్ బ్రాండ్ ఆ లెవల్లో ఉంది. ఇక దానికి తోడు కుటుంబ సమేతంగా యాడ్ లో నటించాడు కాబట్టి అంత పెద్ద మొత్తం ముట్టిందట. కొందరైతే మల్టీ ఇయర్ కాంట్రాక్ట్ కుదుర్చుకుని ఉంటే ఈ పారితోషికం రేంజ్ ఇంకా చాలా పెద్ద మొత్తంలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇవేవీ పట్టనట్టు మహేష్ తిరిగి ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ తో బిజీ. ఈ దీపావళి కానుకగా చిత్రబృందం ప్రచారం హోరెత్తించిన సంగతి తెలిసిందే. దసరా-దీపావళి పోస్టర్లు అభిమానుల్లోకి దూసుకెళ్లాయి. సంక్రాంతికి పందెం పుంజులా మహేష్ బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే.




Please Read Disclaimer