నేను మాల్దీవుల బ్యాచ్ కాదన్న అదా శర్మ

0

కరోనా లాక్ డౌన్ కారణంగా దాదాపు ఆరు నెలల పాటు పూర్తిగా ఇంటికే పరిమితం అయిన సెలబ్రెటీలు మళ్లీ యథావిధిగా బిజీ అవుతున్నారు. ఇన్నాళ్లు కట్టేసినట్లుగా ఉన్న ప్రముఖులు ముఖ్యంగా స్టార్స్ విదేశీ ప్రయాణాలకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం యూఎస్ యూకేతో పాటు యరప్ కరోనాతో వణికి పోతున్నాయి. కనుక మాల్దీవులు మరియు దుబాయ్ కి స్టార్స్ క్యూ కడుతున్నారు. చాలా మంది ముద్దుగుమ్మలు మాల్దీవులకు వెళ్లి ఫొటోలను షేర్ చేస్తున్నారు. ఇటీవల అదాశర్మ కూడా ఒక వీడియోను మరియు ఫొటోలను షేర్ చేయడంతో ఈమె కూడా మాల్దీవులకు వెళ్లిందేమో అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేశారు.

తాను మాల్దీవులకు వెళ్లలేదని షూటింగ్ లో భాగంగా మహారాజాపురంలో ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది. తమిళనాడు కేరళ మద్య ఉండే ఈ మహారాజాపురంలోని అందమైన లొకేషన్స్ లో తాను షూటింగ్ లో పాల్గొంటున్నాను అని.. ఇదేం మాల్దీవులు కాదు అంటూ ఇండైరెక్ట్ గా తాను మాల్దీవుల బ్యాచ్ కాదు అంటూ వారికి కౌంటర్ ఇచ్చింది. ఈ అమ్మడు ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్ తో కూడా బిజీగా ఉంది. సౌత్ లో అన్ని భాషల్లో కూడా ఈమెకు అవకాశాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈమె ప్రస్తుతం వెబ్ సిరీస్ పై దృష్టి పెట్టింది. దానికి సంబంధించిన షూటింగ్ హడావుడిగా జరుగుతోంది. ఈసమయంలో మాల్దీవులకు ఈమె వెళ్లేంత మూడ్ తో ఉండక పోవచ్చు.