మార్జాల మంత్రగత్తె జూమంతర్

0

చూడగానే పక్కా మోడ్రన్ గా కనిపించినా కొందరిలో మంత్రగత్తె (మాంత్రికురాలి) వేషాలకు కొదవేమీ ఉండదు. బ్యాడ్ బోయ్స్ (ఫర్ లైఫ్) హాలీవుడ్ చిత్రంలో లేడీ విలన్ క్యారెక్టర్ అంతగా వరల్డ్ పాపులర్ అవ్వడానికి ఆ క్యారెక్టరైజేషన్ లో ఉన్న కిక్కే అలాంటిది. ఎంతో అందంగా మోడ్రన్ గా కనిపిస్తూనే బికినీలో వేడి పెంచుతూనే మంత్రగత్తెలా మంత్రాలు చదువుతూ నరహంతకురాలిగా ప్రవర్తిస్తుంది ఆ హీరోయిన్.

అయితే ఇప్పుడు హాలీవుడ్ విచ్ కి ఏమాత్రం తగ్గకుండా చెలరేగుతోంది ముంబై గాళ్ అదా శర్మ. ఇదిగో చారల బికినీలో అంత స్టైలిష్ గా మోడ్రన్ గా కనిపిస్తూనే.. ఆ పక్కనే మార్జాలం (పిల్లి)తో ఎలా ఫోజిచ్చిందో కదా! సోషల్ మీడియాలలో వినూత్న పంథాలో డేరింగ్ ఫీట్స్ వేయడం అదాకు కొత్తేమీ కాదు కానీ ఈసారి నెవ్వర్ బిఫోర్ హాట్ లుక్ తో కట్టిపడేస్తోంది. ముఖ్యంగా హీట్ పెంచే దేహశిరుల్ని ఎంతో అందంగా ఎలివేట్ చేసిన అదా లుక్ .. ఆ పర్ఫెక్ట్ పిజిక్… థై షో సంథింగ్ స్పెషల్ ట్రీట్ అనే చెప్పాలి.

ఇంతకీ ఆ మార్జాలాన్ని పరిశీలనగా చూస్తే అదేదో జిమ్మిక్ లా కనిపించడం లేదూ? ఈ వేషం కూడా అదా శర్మ అనే మంత్రగత్తె వేషమా? అని డౌట్ పుట్టుకొస్తోంది. ఒక సాధారణ ఫోటోకి ఆ మార్జాలాన్ని మార్ఫింగ్ ద్వారా జోడించినట్టే కనిపిస్తోంది. ఇది నిజమైన పిల్లినా? ఎడిటింగ్ పిల్లినా? అంటూ సోషల్ మీడియాలో సందేహం వ్యక్తమవుతోంది. ఈ ప్రశ్నలన్నిటికీ మార్జాల మంత్రగత్తె సమాధానం చెబుతుందేమో చూడాలి. ఇటీవలి కాలంలో సినిమాల్లో ఛాన్సులు తగ్గడంతో అదా ఇలా సోషల్ మీడియా జపం చేస్తూ అక్కడే ఆదాయ ఆర్జన మార్గాల్ని వెతుకుతోంది. అనుకున్న విధంగానే సక్సెసైంది కూడా.
Please Read Disclaimer