అదా శర్మ ఫిట్ అండ్ హాట్ లుక్

0

ముంబై హాట్ గాళ్ అదా శర్మ సోషల్ మీడియా లో ఎంత స్పీడ్ గా ఉంటుందో తెలిసిందే. నిరంతరం ఏదో ఒక హాట్ అప్ డేట్ తో అభిమానుల కు టచ్ లో ఉంటుంది. సినిమాల తో కంటే పబ్లిసిటీ స్టంట్ తోనే ఈ అమ్మడు నిరంతరం మీడియా అటెన్షన్ ని తన వైపు తిప్పేసుకుంటోంది. ఇక ప్రస్తుతం ఉన్న అందాల భామల కు ఏ మాత్రం తగ్గకుండా ఫిట్ నెస్ లోనూ ఈ అమ్మడు స్పీడ్ చూపిస్తోంది.

రెగ్యులర్ జిమ్ .. యోగా.. ఫిట్నెస్ వీడియోల్ని నెటి జనులకు షేర్ చేస్తూనే ఉంది అదా. వీటికి సోషల్ మీడియా లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఈ భామ ప్రఖ్యాత గ్లోబల్ ఫిట్ అండ్ ఫ్యాబ్ అవార్డ్స్ లో తళుక్కుమంది. బాలీవుడ్ అందగత్తెల నడుమ ఈ అమ్మడు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అదా సంథింగ్ హాట్ ఫిట్ అంటూ ఫ్యాన్స్ కితాబునిస్తున్నారు ఈ ఫోటోలు చూశాక.

ప్రస్తుతం అదాశర్మ కమెండో 3లో నటిస్తున్న సంగతి తెలిసిందే. విద్యుత్ జమ్వాల్ లాంటి స్టార్ సరసన అవకాశం అందుకున్న ఈ భామ యాక్షన్ క్వీన్ గా స్టంట్స్ తో అదరగొట్టేస్తోంది. అదాకి బాలీవుడ్ లో గ్రేట్ ఆపర్చునిటీ అనే చెప్పాలి. ఈ సినిమాతో పాటు పలు టీవీ కార్యక్రమాల తోనూ అదా బిజీగా ఉంది.
Please Read Disclaimer