బికినీతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోందే

0

‘హార్ట్ ఎటాక్’.. ‘S/o సత్యమూర్తి’.. ‘క్షణం’ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులలో గుర్తింపు తెచ్చుకున్న భామ అదా శర్మ. తెలుగు మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా నటించింది. అయితే ఈమధ్య తెలుగులో కాస్త జోరు తగ్గింది. లాస్ట్ సినిమా ‘కల్కి’ కూడా బాక్స్ ఆఫీసు వద్ద నిరాశ పరిచింది. సినిమాల సంగతి పక్కన పెడితే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో రచ్చ చేయడంలో ఎప్పుడో డిప్లొమా చేసేసింది. హాటు ఫోటోలు పోస్ట్ చేయడం తనకు వెన్నతో పెట్టిన విద్య.

తాజాగా మరోసారి అదే పని చేసింది. తన ఇన్స్టా ఖాతా ద్వారా కొన్ని బికినీ ఫోటోలు పోస్ట్ చేసింది. ఈ ఫోటోలకు “నేను చిరుతపులిలాంటి డ్రెస్ వేసుకున్న టేబుల్ ముందు కూర్చున్న అమ్మాయిని. ఒక అబ్బాయి దోశ చట్నీ కోసం వేచి చూస్తున్నా. రాహుల్ ఒక చిరుతపులి.. నేను కాదు” అంటూ ఒక క్యాప్షన్ ఇచ్చింది. అదా క్యాప్షన్ కు అర్థం.. బాయ్ అక్కడకు దోశ – చట్నీని ఒక ప్లేట్ లో తీసుకొస్తే వాటిని తింటుందా.. లేక అబ్బాయిని ‘దోశ-చట్నీ’ లాగా భావించి గుటుక్కున మింగేస్తుందా?

ఈ ఫోటోలకు నెటిజన్లు ఇంట్రస్టింగ్ కామెంట్లు పెట్టారు. “అదా నీ పోస్టులు.. ఫోటోలు తేడాగానే ఉంటాయి”.. “ఆ చిరుతపులి గోలేంటో చెప్పు”.. “పర్ ఫెక్ట్ బికినీ షేప్”.. “చీతా.. డేంజరస్ కర్వ్స్” అంటూ కామెంట్లు పెట్టారు. ఒకరైతే “నీకేమైనా పిచ్చా” అంటూ ఘాటుగా స్పందించారు. ఇక అదా ఫ్యూచర్ సినిమాల విషయానికి వస్తే ‘కమాండో 3’.. ‘మ్యాన్ టు మ్యాన్’.. ‘బైపాస్ రోడ్’ అనే చిత్రాల్లో నటిస్తోంది. అన్నీ బాలీవుడ్ ప్రాజెక్టులే.
Please Read Disclaimer