పబ్లిక్ ని భయపెడుతున్న నాటీ హీరోయిన్

0

అదాశర్మ పబ్లిసిటీ స్టంట్ ఇన్ స్టాల్లో కొంటె వేషాల గురించి ఇప్పుడే పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు ఇతర నాయికలతో పోలిస్తే ఎంతో వైబ్రేంట్. సోషల్ మీడియా పబ్లిసిటీ పరంగా ఇతరుల కంటే ఓ అడుగు ముందుంటుంది.

సౌత్ కి సుపరిచితమైన నాయికల్లో ఇంతగా పబ్లిసిటీ స్టంట్ కి రెడీ అయ్యే వేరొక భామ లేదు అంటే అతిశయోక్తి కాదు. అదా కి అదా ట్విట్టర్ సహా అదా ఇన్ స్టాల్లో విపరీతంగా ఫాలోయింగ్ పెరిగింది అంటే అది ఈ అమ్మడి క్రియేటివిటీ వల్లనే. నిరంతరం వేడెక్కించే ఫోటోషూట్లతో యూత్ కి బాగా చేరువైంది ఈ బ్యూటీ.

సినిమాలతో కంటే ఇటీవల సోషల్ మీడియాలతోనే విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకున్న అదా రకరకాల కళల్ని ప్రదర్శిస్తూ ఆకర్షిస్తోంది. ఇంతకుముందు మైమ్ కళ సహా వెంట్రిలాక్విలిజమ్ ని ప్రదర్శించి షాకిచ్చింది. తాజాగా మాస్క్ ధరించి జోకర్ లా మారింది. ఒక రకంగా పబ్లిక్ ని భయపెట్టేస్తోందిలా. విమనాశ్రయం షేకయ్యేలా బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ డ్రెస్ లో దిగిపోయింది. అంతేనా ఆ గాగుల్స్ కి కాంబినేషన్ గా ప్రోస్థటిక్స్ మాస్క్ ధరించి స్పెషల్ షోతో అదరగొట్టిందిలా. ప్రస్తుతం అదా వరుసగా సినిమాలకు కమిటవుతోంది. ఈ అమ్మడు నటించిన వెబ్ సిరీస్ లు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. మరోవైపు సోషల్ మీడియా ప్రకటనలతోనూ నాలుగు చేతులా ఆర్జిస్తోంది.