రెడ్ హాట్ లేడీ కమెండో

0

అదా కి అదా ట్విట్టర్ ట్రీట్ గురించి తెలిసిందే. నిరంతరం ఇక్కడ తన క్రియేటివిటీని అభిమానులకు పరిచయం చేస్తోంది అదా. ఇప్పటికే ఈ భామకు ట్విట్టర్.. ఇన్ స్టా మాధ్యమాల్లో భారీగా పాలోవర్స్ ఉన్న సంగతి తెలిసిందే. అందుకే రెగ్యులర్ గా ఈ వేదికలపై టచ్ లో ఉంటోంది. అంతేకాదు.. ట్విట్టర్ లో పలు కార్పొరెట్ బ్రాండ్ల ప్రమోషన్స్ తో పాటుగా.. తాను నటించే సినిమాలకు ప్రమోషన్ చేస్తుంటుంది అదా.

ఓ రకంగా చూస్తే.. ఇటీవల అదా శర్మకు సినిమాల కంటే సోషల్ మీడియా వ్యాపకాలే ఎక్కువయ్యాయి. పలు కార్పొరెట్ ఉత్పత్తులు తనతో ప్రమోషన్ చేయించుకుంటూ భారీగానే పారితోషికాల్ని చెల్లిస్తుండడంతో ఇదో ప్రధాన ఆదాయ మార్గంగా మారింది. ఇక అదాశర్మ నటిస్తున్న తాజా చిత్రం కమెండో 3 ఈనెల 29న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీగా రిలీజవుతోంది. కమెండో ఫ్రాంఛైజీలోనే భారీ యాక్షన్ చిత్రంగా ప్రమోటవుతోంది ఈ సినిమా. ఇందులో విద్యుత్ జమ్వాల్ కథానాయకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

కమెండో 3 ప్రచారాన్ని అదా తనదైన శైలిలో పీక్స్ కి తీసుకెళుతోంది. తాజాగా ఈ మూవీలో ఉపయోగించిన ఓ లగ్జరీ బ్రాండ్ బైక్ ని అభిమానులకు పరిచయం చేస్తూ .. చాలా విషయాల్నే చెప్పింది. దీనిపై రైడ్ కి వెళ్లాలని ఎవరైనా అనుకుంటున్నారా? ఈ రైడ్ భావనా రెడ్డి (మూవీలో తన రోల్) డ్రీమ్. అసలు తన పాత్ర నిజస్వరూపం ఏమిటి? అన్నది తెలియాలంటే కమెండో 3 చూడండి. ఈనెల 29న థియటర్లలోకి వస్తోంది! అంటూ పబ్లిసిటీ వేడెక్కించేస్తోంది. 5 డిగ్రీల చలిలో షూటింగ్ చేశాం. అందుకే బైక్ ని అలా కవర్ చేసేసాం అంటూ చెప్పుకొచ్చింది. ఇక బైక్ మాటేమో కానీ.. ఆ బైక్ పై రెడ్ హాట్ లుక్ లో కనిపిస్తున్న అదాపైనే ఫ్యాన్స్ కళ్లన్నీ. మిరుమిట్లు గొలిపే ఆ రెడ్ పర్పుల్ జాకెట్ తన అందానికే వన్నె తెచ్చింది. మునుపటి కంటే అదా చాలా హాట్ గా కనిపిస్తోంది.
Please Read Disclaimer