సుకుమారికి మార్షల్ ఆర్ట్స్ ఎందుకో?

0

హీరోలు తాము చేసే సినిమాల్లోని పాత్రల్లో ఒదిగి పోయేందుకు కొన్నాళ్ల ముందు నుండే ఆ పాత్ర కోసం సిద్దం అవుతూ ఉంటారు. బాక్సింగ్ నేపథ్యం సినిమా అయితే ప్రముఖుల వద్ద బాక్సింగ్ శిక్షణ పొందడం.. కబడ్డీ ఆటకు సంబంధించింది అయితే ఆ ఆటలో ప్రావిణ్యం పొందడం చేస్తూ ఉంటారు. ఇలా ఏ పాత్రకు తగ్గట్లుగా తమను తాము మలుచుకుంటూ ఉంటారు. ఇలా కేవలం హీరోలు మాత్రమే కాకుండా హీరోయిన్స్ కూడా అప్పుడప్పుడు చేయబోతున్న పాత్రల కోసం కష్టపడుతూ ఉంటారు.

ప్రస్తుతం అదాశర్మ తాను త్వరలో చేయబోతున్న ఒక పాత్ర కోసం చాలా కష్టపడుతుంది. తెలుగు ప్రేక్షకులు హార్ట్ ఎటాక్ తో పరిచయం అయ్యింది. కాని హార్ట్ ఎటాక్ తెప్పించడంలో మాత్రం విఫలం అయ్యింది. అందుకే ఆమె తెలుగు సినిమాలకు చాలా త్వరగా దూరం అయ్యింది. మళ్లీ తెలుగులో నటిస్తుందో లేదో కూడా తెలియదు. అయితే ప్రస్తుతం ఈమె వెబ్ సిరీస్ లో నటించే అవకాశాలు దక్కించుకుంటుంది. ఈమె చేయబోతున్న ఒక వెబ్ సిరీస్ లో మార్షల్ ఆర్ట్స్ తెలిసిన పాత్రలో కనిపించబోతుందట.

ఆ పాత్ర కోసం ప్రాచీన యుద్ద విద్య అయిన కలరిపట్టు మరియు సిలింబమ్ నేర్చుకుందట. వీటితో పాటు నాంచక్ విద్యను కూడా ఈమె నేర్చుకుంటుందట. హీరోయిన్స్ మరీ సుకుమారంగా ఉంటారు. అలాంటి ఈమె ఇన్ని ఫైటింగ్స్ కు సంబంధించి మెలకువలను నేర్చుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఈ అమ్మడు ముందు ముందు మరెంతగా కష్టపడుతుందో మరి. వెబ్ సిరీస్ తో ఈమె మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వాలని ఆరాటపడుతుంది. మరి ఆమె కోరిక తీరేనా చూడాలి.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home