అమ్మడి అందాల క్రియేటివిటీ పీక్స్

0

హార్ట్ ఎటాక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అదాశర్మ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు తక్కువే అయినా కూడా సోషల్ మీడియాలో ఆమె చేసే సందడి మాత్రం చాలా ఎక్కువ. ఈ అమ్మడు రెగ్యులర్ గా సోషల్ మీడియాలో అందాల ఆరబోత ఫొటో షూట్ షేర్ చేస్తుంది. తన వర్కౌట్ వీడియోలు.. యోగా ఫొటోలు మరియు వీడియోలను షేర్ చేయడంతో పాటు డిఫరెంట్ గా మేకప్ మరియు హెయిర్ స్టైల్ తో విభిన్నంగా కనిపించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటుంది. తాజాగా ఈమె మరో ప్రయత్నం చేసింది.

విభిన్నమైన హెయిర్ స్టైల్ తో డిస్నీ ప్రిన్సెస్గా అదాశర్మ కనిపిస్తుంది. పెద్ద ముక్కు పోగుతో పాటు సరికొత్త డిజైనర్ డ్రస్ తో పాటు ఆకట్టుకునే అందమైన ఔట్ ఫిట్ తో ఈ అమ్మడు చూడగానే వావ్ అనిపించేలా ఉంది. ప్రస్తుతం ఈ అమ్మడు సినిమాల షూటింగ్ లు లేకపోవడంతో ఇలా క్రియేటివిటీగా ఆలోచిస్తుందా అనిపిస్తుంది. మొత్తానికి ఈ అమ్మడు ఇలాంటి క్రియేటివిటీని ప్రదర్శించి మళ్లీ టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ దృష్టిలో పడుతుందేమో చూడాలి. వెబ్ సిరీస్ లు మరియు సినిమాల్లో ఈమెకు మళ్లీ అవకాశాలు వస్తాయేమో అంటూ ఆమె సన్నిహితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.