ఈమె ఫీట్స్ కు హార్ట్ ఎటాక్ ఖాయం

0

పూరి మూవీ ‘హార్ట్ ఎటాక్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ అదాశర్మ తెలుగులో ఆశించిన స్థాయిలో గుర్తింపును దక్కించుకోవడంలో విఫలం అయ్యింది. పలు సినిమాలు చేసినా కూడా ఏ ఒక్క సినిమాతో ఆమెకు మంచి స్టార్ డం అయితే రాలేదు. దాంతో తమిళం మరియు కన్నడంలో కూడా ఈ అమ్మడి ప్రయత్నాలు జరిగాయి. అక్కడ కూడా అంతంత మాత్రంగానే ఉంది.

అవకాశాలు ఉన్నా లేకున్నా కూడా సౌత్ ఇండియన్ సినీ జనాల దృష్టిని ఎప్పటికప్పుడు ఆకర్షిస్తూనే ఉంది ఈ అమ్మడు. సోషల్ మీడియాలో చాలా రెగ్యులర్ గా ఈమె వీడియోలు మరియు ఫొటోలు పోస్ట్ చేస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ఈమె చాలా కఠినమైన యోగా ఆసనాలు వేస్తూ ఫొటోలకు ఫోజ్ లు ఇచ్చి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.

తాజాగా ఈమె ఇచ్చిన యోగా ఫోజ్ స్టిల్ అందరి గుండె జారి హార్ట్ ఎటాక్ వచ్చేలా ఉంది. ఈమె కాళ్లు పైకి వేళడగట్టుకుని తల కిందికి పెట్టి రివర్స్ లో సూర్య నమస్కారం చేసింది. ఈమె చేసిన నమస్కారంతో అంతా కూడా అవాక్కవుతున్నారు. బాబోయ్ మరీ ఇంత కష్టమైన ఫీట్స్ ఏంటీ అమ్మడు అంటూ ప్రశ్నిస్తున్నారు. యోగాలో చాలా ప్రావిణ్యం ఉన్నట్లుగా అదాశర్మ ఫీట్లు చేస్తుంది. యోగాలో హాట్ అందాలను ప్రదర్శించడం ఈ అమ్మడి ప్రత్యేకత. అందుకే ఈమె యోగా హాట్ ఫోజ్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి.
Please Read Disclaimer