బిగ్ బాస్ షో అనుకున్నావా? అలా విమర్శిస్తే మొదటికే మోసం

0

సుదీర్ఘకాలంగా సినిమా ఇండస్ట్రీలో సాగుతున్నా.. కొన్ని విషయాల్ని ఎక్కడైతే ప్రస్తావించకూడదో అక్కడే ప్రస్తావించి.. పెద్ద తప్పే చేశారంటున్నారు బిగ్ బాస్ తో కొత్త ఇమేజ్ ను సొంతం చేసుకున్న అదర్శ్. సినిమాల్లో విలన్ పాత్రలు చేసే అతనికి బిగ్ బాస్ సీజన్ వన్ లో కంటెస్టెంట్ గా చేసిన తర్వాత సరికొత్త ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు.

బిగ్ బాస్ తర్వాత తనకొస్తున్న ఆఫర్లను ఆచితూచి అన్నట్లుగా ఎంపిక చేసుకుంటున్న అతగాడు.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాటల మాంత్రికుడు.. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై చేసిన విమర్శలతో వార్తల్లోకి వచ్చాడు. ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో రంగమార్తండ మూవీలో పని చేస్తున్న ఆదర్శ్.. త్రివిక్రమ్ తీరుపై ఆవేదన వ్యక్తం చేశాడు.

త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఎన్టీఆర్ నటించిన అరవింద సమేతలో తాను నటించానని.. ఫైనల్ ఎడిటింగ్ లో లేపేసినట్లుగా పేర్కొన్నారు. ఎన్టీఆర్ కాంబినేషన్ లో తాను చేసిన ఒక సీన్ తనకెంతో ఇష్టమన్నారు. అలాంటి సీన్ లేపేయటం తనకెంతో బాధ కలిగించిందన్నారు. అదే విషయాన్ని త్రివిక్రమ్ కు చెప్పానన్న ఆదర్శ్.. మాటల మాంత్రికుడికి నేరుగా చెప్పానన్నారు.

త్రివిక్రమ్ కు వ్యక్తిగతంగా చెప్పటం వేరని.. అదే విషయాన్ని మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తావించటాన్ని ఇష్టపడరన్నది ఆదర్శ్ ఎందుకు మిస్ అయ్యారన్న ప్రశ్న వినిపిస్తోంది. ఇలా తప్పు పట్టటాన్ని సినీ ప్రముఖులు అంగీకరించన్న విషయాన్ని బిగ్ బాస్ ఆదర్శ్ మిస్ కావటమా? అన్న ప్రశ్న వినిపిస్తోంది. అయినా.. మనసుకు తోచినట్లుగా చెప్పేయటానికి ఇదేమైనా బిగ్ బాస్ షో అనుకుంటున్నారా? అన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. ఒక ప్రముఖ దర్శకుడ్ని ఉద్దేశించి బిగ్ బాస్ ఆదర్శ్ చేసిన వ్యాఖ్యల ఎఫెక్ట్ రానున్న రోజుల్లో పడక తప్పదంటున్నారు
Please Read Disclaimer