రవితేజ సముద్రంలో చెలియ భామ

0

గత ఏడాది పెద్దగా అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం నమోదు చేసుకున్న ఆరెక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి ఇంకా తన రెండో ప్రాజెక్ట్ మొదలుపెట్టలేదు. మహా సముద్రం టైటిల్ తో ఓ స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నాడని ఓ ఇద్దరు ముగ్గురు యూత్ హీరోలను ట్రై చేసి ఆగిపోయడని ఏదేదో ప్రచారం జరిగింది. వీటిలో సమంతా పేరు కూడా వినిపించింది.

అయితే ఇవేవి నిజం కాదని అజయ్ భూపతి ఈ సబ్జెక్టుకు రవితేజను లాక్ చేసుకున్నాడని విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే కథ వినిపించి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నాడని ప్రస్తుతం చేస్తున్న డిస్కో రాజా పూర్తి కాగానే రవితేజ ఇందులో జాయిన్ అవుతాడని ఫిలిం నగర్ టాక్. ఈ లోగా మిగిలిన పనుల్లో బిజీగా ఉన్న అజయ్ భూపతి హీరొయిన్ ని లాక్ చేసినట్టు ఫ్రెష్ అప్ డేట్

మణిరత్నం చెలియాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై సమ్మోహనంతో హిట్టు బోణీ కొట్టిన ఆదితి రావు హైదరిని రవితేజకు జోడిగా సెట్ చేసినట్టు సమాచారం. అఫీషియల్ కన్ ఫర్మేషన్ కు టైం పడుతుంది కాని ప్రస్తుతానికి ఓకే అయినట్టు తెలిసింది. ఆదితి ప్రస్తుతం ఇంద్రగంటి తెరకెక్కిస్తున్న నాని-సుదీర్ బాబుల కాంబో మూవీ వి లో నటిస్తోంది. అదయ్యాక తనూ దీంట్లోకి వచ్చేస్తుంది. మహా సముద్రం టైటిల్ తోనే రవితేజ ఇమేజ్ కు తగ్గట్టుగా కొన్ని కీలక మార్పులతో అజయ్ భూపతి దీన్ని పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందించబోతున్నట్టు సమాచారం. త్వరలోనే పూర్తి వివరాలు తెలియవచ్చు
Please Read Disclaimer