ఆ సినిమాకు బదులు మరో సినిమా !

0

ప్రస్తుతం టాలీవుడ్ లో థ్రిల్లర్ స్టార్ అనిపించుకుంటున్న అడివి శేష్ మొన్నీ మధ్యే ‘టూ స్టేట్స్’ అనే రీమేక్ సినిమాను స్టార్ట్ చేసి సెట్ పై పెట్టిన సంగతి తెలిసిందే. అయితే అనుకోకుండా ఆ సినిమా ఆగిపోయింది. కథ చేస్తున్నప్పుడు పట్టించుకోకుండా సినిమాను స్టార్ట్ చేసాక చేసిన తప్పులు తెలుసుకొని మధ్యలోనే సినిమా షూటింగ్ కి పులిస్టాప్ పెట్టేసారు. ఈ విషయాన్ని స్వయంగా చెప్పాడు శేష్.

నిజానికి రాజశేఖర్ పెద్దమ్మాయి శివాని రాజశేఖర్ ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అవ్వాల్సింది. లాంచ్ కూడా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. పరిశ్రమలోని ప్రముఖులందరూ అతిథిలుగా హాజరయ్యారు కూడా. అయితే ఈ సినిమా ఆగిపోవడంతో హీరోయిన్ గా బిజీ అవుతానని ఊహించుకున్న శివాని కెరీర్ కూడా స్టక్ అయింది. అందుకే మళ్లీ వీరిద్దరితో ఓ సినిమా నిర్మించనున్నాడట. సినిమా ఆగిపోయిన వెంటనే శేష్ – శివాని కి మరో సినిమా చేద్దామని మాటిచ్చాడట నిర్మాత.

ప్రస్తుతం శేష్ వరుస సినిమాలతో బిజీ గా ఉన్నాడు. ఇమిడియట్లీ మేజర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ‘గూఢచారి 2’ చేస్తాడు. ఈ రెండు సినిమాల తర్వాత కచ్చితంగా టూ స్టేట్స్ నిర్మాతతో సినిమా చేస్తాడు శేష్. మరి శివాని అప్పటి వరకూ ఎదురుచూస్తుందా..? ఈ లోగా మరో సినిమాతో ఎంట్రీ కి రెడీ అవుతుందా.చూడాలి.
Please Read Disclaimer