హర్రర్ సినిమా చూడను..చేయను !

0

తనకు సరిపడే కథలు పాత్రలు ఎంచుకుంటూ థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారుతున్న అడివి శేష్ ఈరోజే ‘ఎవరు’ అనే క్రైమ్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ‘ఎవరు’ ఊహించని విధంగా సినిమాకు పాజిటీవ్ టాక్ వచ్చింది. అయితే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిన్న మీడియాతో ముచ్చటించిన ఈ హీరో తను హార్రర్ సినిమాల జోలికి వెళ్లాలని కరాకండిగా చెప్పేసాడు.

వరుసగా థ్రిల్లర్ సినిమాలే చేస్తున్నారు మీ నుండి హారర్ తో కూడిన థ్రిల్లర్ సినిమా ఎప్పుడు ఊహించొచ్చదనే ప్రశ్నకి హారర్ సినిమాలంటే భయమని నటించడానికి కాదే చూడటానికి కూడా ఇష్టపడనని చెప్పుకొచ్చాడు. ‘క్షణం’ తర్వాత ఏమీ తుమీ అనే కెమెడీ సినిమా చేసాను అలాగే యాక్షన్ డ్రామా జోనర్ ‘గూఢచారి’ చేసాను. ‘క్షణం’ తరువాత నేను చేసిన థ్రిల్లర్ ఇదే. సో వరుసగా చేయలేదు. కథ నచ్చతే సేమ్ జోనర్ అన్నది పట్టించుకోను. వచ్చిన సినిమాలు చేస్తూ వెళ్తాను అని తెలిపాడు.

ప్రస్తుతం ‘ఎవరు’ తో థియేటర్స్ లో సందడి చేస్తున్న శేష్ నెక్స్ట్ మహేష్ బాబు నిర్మాణంలో ‘మేజర్’ సినిమా చేస్తున్నాడు. మేజర్ ఉన్ని కృష్ణన్ కథతో బియోగ్రఫీగా తెరకెక్కనున్న ఈ సినిమా అక్టోబర్ నుండి షూటింగ్ జరుపుకోనుంది. వచ్చే ఏడాది ఆగస్ట్ 15 న రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత రాహుల్ పాకాల డైరెక్షన్ లో ‘గూఢచారి 2’ చేయనున్నాడు. గూఢచారికి సీక్వెల్ గా రానున్న ఈ సినిమా 2021 లో అంటే మరో రెండేళ్లకు థియేటర్స్ లోకి వస్తుంది.
Please Read Disclaimer