‘ఎవరు’ అడాప్షన్…బద్లా రీమేక్

0

ప్రస్తుతం ‘ఎవరు’ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూ తన ప్రమోషన్స్ తో సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడానికి తన వంతు కృషి చేస్తున్నాడు ఆడివి శేష్. ఎవరు ప్రమోషన్స్ లో భాగంగా ట్విట్టర్ లో అస్క్ శేష్ ట్యాగ్ తో నిన్న కొంత సేపు అభిమానులతో చాట్ చేసాడు. వరుసగా థ్రిల్లర్ జోనర్ లో హిట్లు కొట్టిన శేష్ కి అభిమానుల నుండి చాలా ప్రశ్నలు ఎదురయ్యాయి. ముఖ్యంగా ‘ఎవరు’ సినిమా గురించి అలాగే నెక్స్ట్ సినిమాల గురించి తమ కున్న సందేహాల ఈ సందర్భంగా శేష్ ను అడిగి తెలుసుకున్నారు.

అయితే నిన్న జరిగిన ట్విట్టర్ లైవ్ చాట్ లో ఒక అభిమాని అడిగిన ప్రశ్న హైలైట్ అయింది. అడాప్షన్ కి కాపీ కి తేడా ఏంటి..? అన్నది ఆ ప్రశ్న. అడాప్షన్ అంటే ఒక సినిమా రైట్స్ తీసుకొని అందులో ఉండే సోల్ తీసుకొని కొత్త కథ అల్లడం ఇది ‘ఎవరు’. రీమేక్ అంటే ఒక కథని రైట్స్ తీసుకొని ఇంచు మించుగా సేమ్ టు సేమ్ తీయడం ఇది బద్లా. ఇక కాపీ అంటే రైట్స్ తీసుకోకుండా దొంగలించడం – లేపేయడం – దొబ్బేయడం – కొట్టేయడం అంటూ ఆ ప్రశ్నకు ఎక్కువ టైం తీసుకోకుండా అదిరిపోయే జవాబిచ్చారు శేష్.

సో ఈ సందర్భంగా మళ్లీ ఒకసారి ఎవరు అడాప్షన్ చేసుకొని చేసిన సినిమా అని బద్లా మక్కి కి మాక్కి ఫాలో అవుతూ రీమేక్ చేసారని వెల్లడించాడు శేష్. ప్రస్తుతం శేష్ నెక్స్ట్ చేయబోయే మేజర్ సినిమా రైటింగ్ మీద ఫోకస్ చేస్తూనే మరో వైపు ‘ఎవరు’ని ఇంకా ముందుకు తీసుకెళ్లి పెద్ద హిట్ చేసే పనిలో ఉన్నాడు.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home