జూనియర్ పవర్ స్టార్ తో ఎవరు!

0

‘ఎవరు’ విజయంతో అడివి శేష్ స్థానం టాలీవుడ్ లో మరింత పదిలంగా మారిన సంగతి తెలిసిందే. ‘ఎవరు’ సినిమాకు ప్రేక్షకుల నుండే కాదు.. ఇండస్ట్రీ వారి నుండి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు ‘ఎవరు’ గురించి గొప్పగా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా శేష్ సినిమా పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ కు కూడా నచ్చిందట. ఈ విషయం వెల్లడిస్తూ శేష్ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు.

తన ఇన్స్టా ఖాతా ద్వారా మూడు ఫోటోలు పోస్ట్ చేసి “ఈ హ్యాండ్సమ్ అబ్బాయితో ఒకరోజు గడిపాను. అకీరాకు ‘ఎవరు’ చాలా నచ్చింది. నాకు చాలా హ్యపీగా ఉంది. తనతో కలిసి లంచ్ చేశాను.. ఎన్నో కబుర్లు చెప్పుకున్నామ. గంభీరమైన గొంతు.. 6′ 4″ హైటు. మా ఇద్దరిలో చాలా కామన్ అంశాలు ఉన్నాయి. ఇద్దరికీ ఎడమచేతివాటం.. ఇంకా చాలా కామన్ విషయాలు ఉన్నాయి. ఆద్య కెమెరా ముందుకు రావడానికి సిగ్గుపడింది. రేణు దేశాయ్ గారు.. మీతో మాట్లాడడం చాలా సంతోషం. మీరు ఒక అద్భుతమైన కవయిత్రి. మిహిరా గారు.. ప్రేమ మాలిని గారు మమల్ని అందరికి ఆతిథ్యం ఇచ్చినందుకు థ్యాంక్ యూ” అంటూ పెద్ద పోస్ట్ పెట్టాడు.

ఈ పోస్ట్ కు రేణు దేశాయి “అది నిజంగా అద్భుతమైన లంచ్. భోజనం తర్వాత మన చర్చ కూడా బాగుంది. నీకు.. అకీరాకు మధ్య నిజంగా క్రేజీగా కామన్ అంశాలు ఉన్నాయి” అంటూ రిప్లై ఇచ్చారు. టాలీవుడ్ లో ఉండే టాల్ హీరోలలో శేష్ ఒకరు.. అయితే శేష్ కంటే అకీరా ఇంకా పొడవు ఉండడం విశేషం. మెగా ఫ్యామిలీలో మరో వరుణ్ తేజ్ లా ఉన్నాడు. ఈ ఫోటోలకు పవన్ ఫ్యాన్స్ లైక్స్ తో.. కామెంట్లతో హోరెత్తించారు. పవన్ కళ్యాణ్ సినిమా ‘పంజా’ లో శేష్ ఒక కీలక పాత్ర చేశాడు. నిజానికి శేష్ కు భారీగా గుర్తింపు తీసుకొచ్చింది పవన్ సినిమానే. అప్పటి నుంచి శేష్ కు పవన్ ఫ్యామిలీతో మంచి రిలేషన్ ఉందని సమాచారం.
Please Read Disclaimer