ఫ్రెగ్నెన్సీ తర్వాత కెరీర్ కంచికి

0

హిందీ చిత్ర సీమతో పాటు తెలుగులోనూ సుపరిచితమైన కథానాయిక నేహా ధూపియా. బాలకృష్ణ `పరమ వీర చక్ర`లో స్పై ఏజెంట్ గా అద్భుత నటనతో ఆకట్టుకుంది ఈ భామ. జూలీగానూ అన్ని పరిశ్రమల్ని హీటెక్కించింది. తెలుగులో నిన్నే ఇష్టపడ్డాను- విలన్ లాంటి సినిమాల్లో నటించిన ఈ బాలీవుడ్ భామ అటుపై హిందీ పరిశ్రమకే పరిమితమైంది. కోస్టార్ అంగాద్ భేడీని పెళ్లాడి లైఫ్ లో సెటిలైన సంగతి తెలిసిందే.

పెళ్లికి ముందు వరకూ కెరీర్ వేరు.. పెళ్లి తర్వాత కెరీర్ వేరు. ప్రస్తుతం సినిమాల స్పీడ్ తగ్గింది. తాజాగా ఓబిడ్డకు జన్మనిచ్చిన ఈ అమ్మడు ఎంతో ఎమోషనల్ గా బరస్ట్ అవ్వడం అభిమానుల్లో చర్చకు వచ్చింది. పెళ్లి తర్వాత సినిమా కెరీర్ క్లైమాక్స్ కు చేరుకుందని నేహా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పెళ్లికి ముందు వరకూ సినిమాలతో హ్యాపీగా ఉన్నా. కానీ పెళ్లి తర్వాత జీవితం వేరుగా ఉంది. ఓ అందమైన కుటుంబం వచ్చింది. ఓ బేబి కూడా మా ఫ్యామిలీ మెంబర్ అయింది. కానీ జన్మనిచ్చిన తర్వాత బాడీ షేమింగ్ ఎదురవుతోందని వాపోయింది.

నేహా ధూపియా ప్రెగ్నెన్సీకి ముందు `తుమ్హారీ షులు` అనే సినిమా చేసింది. ఈ సినిమాలో ఆమె నటనకు అవార్డు కూడా అందుకుంది. అయితే తాను గర్భం దాల్చిన తర్వాత ఒక్క సినిమా అవకాశం కూడా దక్కలేదని పబ్లిక్ వేదికపైనే వాపోవడం చర్చకు వచ్చింది. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ లో నటించే అవకాశం దక్కిందని తెలిపింది. అలాగే భవిష్యత్ లో ఏమవుతుందో చెప్పలేనని నిరాశను వ్యక్తం చేసింది.
Please Read Disclaimer