సమంత పోయి చైతూ వచ్చే

0

ఒకప్పుడు మోడల్స్ ఆ తర్వాత క్రికెటర్స్ ఆ తర్వాత బాలీవుడ్ స్టార్స్ మాత్రమే బ్రాండ్ అంబాసిడర్స్ గా వ్యవహరిస్తూ ఉండే వారు. కాలక్రమేనా తీరు మారుతూ వస్తోంది. ఏ భాషకు ఆ భాష స్టార్స్ తో బ్రాండింగ్ చేయించేందుకు కంపెనీలు భారీగా ఖర్చు చేస్తున్నాయి. టాలీవుడ్ కు చెందిన పలువురు స్టార్స్ పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్స్ గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. టాలీవుడ్ లో అత్యధిక బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తున్న స్టార్ ఎవరు అంటే చిన్న పిల్లలు కూడా ఠక్కుమని చెప్పే పేరు మహేష్ బాబు.

ఈమద్య కాలంలో చాలా మంది స్టార్స్ బ్రాండ్ అంబాసిడర్స్ గా మారిపోతున్నారు. కోల్గెట్ కు పలువురు క్రికెటర్స్.. ఎంతో మంది బాలీవుడ్ స్టార్స్ ప్రమోటర్స్ గా వ్యవహరించారు. తెలుగులో అల్లు అర్జున్.. సమంతలు కూడా అంబాసిడర్స్ గా వ్యవహరించారు. అల్లు అర్జున్ తర్వాత సమంత కోల్గెట్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించింది. సమంత కోల్గెట్ యాక్టివ్ సాల్ట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించగా ఇప్పుడు నాగచైతన్య రంగంలోకి దిగాడు. సమంత టర్మ్ అయ్యిందో లేదా కొనసాగుతుందో తెలియదు కాని ఇప్పుడు నాగచైతన్య కోల్గెట్ మ్యాక్స్ ప్రెష్ బ్రాండ్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు.

ఈయన నటించిన యాడ్స్ కూడా అప్పుడే బుల్లి తెరపై సందడి చేస్తూనే ఉన్నాయి. సమంత ప్రమోట్ చేసిన బ్రాండ్ నే ఇప్పుడు విడిగా నాగచైతన్య మ్రోట్ చేయడం జరుగుతుంది. నాగచైతన్య మరియు సమంతలు కలిసి కూడా ప్రమోట్ చేస్తున్న విషయం తెల్సిందే. సినిమాలతోనే కాకుండా ఈ అక్కినేని జంట ఇలా ప్రకటనలతో కూడా కోట్లు కూడబెడుతున్నారు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ జంటను వెండి తెరపై చూసినా బుల్లి తెరపై చూసినా కూడా ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అందుకే వీరికి కోట్లు కురిపించేందుకు ఎన్నో కంపెనీలు సిద్దంగా ఉన్నాయట.
Please Read Disclaimer