సైరా తర్వాత సూరి ఎవరితో..?

0

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ రేపు విడుదల అవుతోంది. దీంతో అందరి దృష్టి ‘సైరా’ పైనే ఉంది.. ముఖ్యంగా దర్శకుడు సురేందర్ రెడ్డి సత్తాకు ఈ సినిమా ఒక టెస్టే అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే సురేందర్ కెరీర్ లో ఇలాంటి భారీ బడ్జెట్.. హిస్టారికల్ ఫిలిం తెరకెక్కించడం మొదటిసారి. ఈ సినిమా ఫలితం రేపటికల్లా తెలిసిపోతుంది. అయితే ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి ఏ హీరోతో సినిమా చేస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

సురేందర్ వరసగా స్టార్ హీరోలతోనే సినిమాలు చేస్తున్నారు. అయితే సూరి నెక్స్ట్ ఫిలిం మాత్రం స్టార్ హీరోతో ఉండదని ఫిలిం నగర్ టాక్. సూరి తన నెక్స్ట్ ఫిలిం యంగ్ హీరో నితిన్ తో చేస్తాడనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలు సాగుతున్నాయట. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించేందుకు రెడీగా ఉన్నారని అంటున్నారు.

అయితే నితిన్ డైరీలో అసలు ఖాళీ లేదు. నితిన్ ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా కాకుండా మరో మూడు ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. మరి సురేందర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే వాటి పరిస్థితి ఏంటనేదానిపై క్లారిటీ లేదు. నితిన్ – సురేందర్ సినిమా అసలు పట్టాలెక్కుతుందా.. లేక జస్ట్ గాసిప్ గా మిగిలిపోతుందా అనేది తెలియాలనే మనం కొద్దిరోజులు వేచి చూడకతప్పదు.
Please Read Disclaimer