నాని సినిమాకు ఉన్నట్లుండి ఇంత డిమాండ్ ఏంటో?

0

నాని హీరోగా నివేదా థామస్ హీరోయిన్ గా ఆది పినిశెట్టి కీలక పాత్రలో తెరకెక్కించి చిత్రం ‘నిన్ను కోరి’. 2017వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు మ్యూజికల్ గా కమర్షియల్ గా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. నాని కెరీర్ లో బెస్ట్ చిత్రాల్లో ఒక్కటిగా నిన్ను కోరి ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. అలాంటి నిన్ను కోరి చిత్రం ఇప్పుడు తమిళ ప్రేక్షకుల ముందుకు వెళ్లేందుకు రెడీ అవుతుంది.

తమిళంలో ‘నిన్ను కోరి’ చిత్రాన్ని థల్లి పొగత్తయ్ అనే టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు. అథర్వ మురళి ఇంకా అనుపమ పరమేశ్వరన్ లు ఈ రీమేక్ లో నటిస్తున్నారు. తమిళంలో ఈ చిత్రం షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. తమిళ రీమేక్ పూర్తి కాకుండానే కన్నడంలో ఈ సినిమా రీమేక్ ప్రారంభం అయ్యింది. తాజాగా నిన్ను కోరి కన్నడ రీమేక్ కు ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి.

కన్నడ స్టార్ ధృవ సర్జ హీరోగా ఈ చిత్రం రూపొందబోతుందట. రీమేక్ కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుపుతున్నట్లుగా కన్నడ మీడియా లో వార్తలు వస్తున్నాయి. నాని పాత్రను ధృవ సరిగ్గా చేస్తాడంటూ అంతా భావిస్తున్నారు. కాస్త ఆలస్యం అయినా కూడా తమిళం మరియు కన్నడ ప్రేక్షకుల ముందుకు నిన్ను కోరి వెళ్లడం ఆనందంగా ఉందంటూ నాని అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. నిన్ను కోరి అక్కడ కూడా మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-