మరోసారి తాత పాత్రను తిరష్కరించిన ఎన్టీఆర్

0

ప్రస్తుతం అన్ని భాషల్లో కూడా బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. తెలుగులో ఇప్పటికే పలువురు ప్రముఖుల బయోపిక్ లు వచ్చాయి. ప్రస్తుతం తమిళ మాజీ ముఖ్యమంత్రి.. ఒకప్పటి హీరోయిన్ అయిన జయలలిత బయోపిక్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుంది. ‘తలైవి’ టైటిల్ తో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ టైటిల్ రోల్ లో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. భారీ బడ్జెట్ తో పాటు భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ ను సంప్రదించారట.

జయలలిత జీవితం గురించి చూపించాలంటే మొదట ఆమె సినీ జీవితాన్ని చూపించాలి. ఆమె ఎన్నో సూపర్ హిట్స్ లో నటించింది. ఎంతో మంది లెజెండీ స్టార్స్ తో నటించింది. నందమూరి తారక రామారావుతో కూడా ఆమె నటించింది. అందుకే ఈ చిత్రంలో ఎన్టీఆర్ కూడా కనిపించబోతున్నాడు. ఎన్టీఆర్ పాత్ర కోసం ఆయన మనవడు అయిన ఎన్టీఆర్ ను చిత్ర యూనిట్ సభ్యులు సంప్రదించారట. గతంలో మాదిరిగానే ఈసారి కూడా ఎన్టీఆర్ మరోసారి తన తాత పాత్రను చేసేందుకు తిరష్కరించాడట.

మహానటి చిత్రం కోసం ఎన్టీఆర్ ను ఎన్టీఆర్ పాత్ర కోసం సంప్రదించారట. ఆ సమయంలో తాత పాత్రలో నటించేంతటి ఘనుడిని నేను కాదు అంటూ సున్నితంగా తిరష్కరించాడట. నేను ఎప్పటికి కూడా తాత పాత్రలో నటించలేను అంటూ చెప్పాడట. తలైవి యూనిట్ సభ్యులు అడిగిన సమయంలో కూడా సున్నితంగా బిజీ షెడ్యూల్ అంటూ తిరష్కరించాడట. ఎన్టీఆర్ నో చెప్పడంతో ఎన్టీఆర్ పాత్రకు మరెవ్వరినైనా ఎంపిక చేసేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుండగా రామ్ చరణ్ తో ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ నటించబోతున్న సినిమాపై ఇంకా క్లారిటీ రాలేదు. ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో అంటూ వార్తలు వస్తున్నాయి. కాని ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు.
Please Read Disclaimer