ఏజ్ లెస్ బ్యూటీ వెకేషన్ మూడ్

0

మునుపటి తరం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాధురి దీక్షిత్ పేరు తెలియని వారు హిందీ సినిమా ప్రేక్షకులు దాదాపుగా ఉండరు. 80..90 లలో బ్లాక్ బస్టర్లతో మాధురి బాలీవుడ్ ను ఒక ఊపు ఊపేసింది. ‘హమ్ ఆప్కే హై కౌన్’ లాంటి ‘సాజన్’ లాంటి సూపర్ డూపర్ హిట్స్ ఆమెలిస్టులో లెక్కలేనన్ని ఉన్నాయి. ఇప్పటికీ మాధురి బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తున్నారు. మాధురి సోషల్ మీడియా మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తూ అభిమానులతో నిత్యం టచ్ లో ఉంటారు.

రీసెంట్ గా మాధురి తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేశారు. ఈ ఫోటోకు “హాలిడే మూడ్ లో ఉన్నాను. #త్రో బ్యాక్” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. త్రోబ్యాక్ అన్నారు కాబట్టి ఈ ఫోటో పాతదే. అయితేనేం ఫోటో మాత్రం కొత్తదిగానే కనిపిస్తోంది. సూపర్ సీనరీ ఉండే ఒక లొకేషన్ లో బోటులో కూర్చొని ఉన్నారు. మిక్స్డ్ కలర్స్ ఉండే ఒక స్టైలిష్ టాప్ ధరించి నవ్వుతూ పోజచ్చారు. బ్రౌన్ షేడ్ లో ఉన్న హెయిర్.. బ్లాక్ గాగుల్స్ తో మాధురి చాలా అందంగా కనిపిస్తున్నారు. ఈఫోటోను చూసినవారు ఈయసులో మాధురి ఇంత అందంగా ఎలా ఉన్నారు.. అనే ఆలోచనలో పడిపోవాల్సిందే.

ఈ ఫోటోలకు నెటిజన్లు సూపర్ కామెంట్లు పెట్టారు. “మోస్ట్ బ్యూటిఫుల్ లేడీ”.. “ఎవర్ గ్రీన్ బ్యూటీ”.. “ఏజ్ లెస్ బ్యూటీ”..అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. సినిమాల విషయానికి వస్తే మాధురి ఈమధ్య రిలీజ్ అయిన ‘కళంక్’ చిత్రంలో బహార్ బేగమ్ పాత్రలో నటించారు. ఇక టీవీలో పాపులర్ డ్యాన్స్ షో ‘డ్యాన్స్ దీవానే’ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్నారు.
Please Read Disclaimer