కోవిడ్ అంటుకుంటే చిల్లింగ్ అంటావేంటి శ్రియా?

0

కోవిడ్ కారణంగా చాలా మంది భయంతో వణికిపోతున్నారు. కోవిడ్ ఎంటరై ఏడు నెలలు గడుస్తున్నా దాని తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరినీ చుట్టేస్తోంది. వీక్ గా వున్న బాడీల్ని ఓ ఆట ఆడేస్తోంది. ఇప్పటికే దీని బారిన పడి కొంత మంది సెలబ్రిటీలు మృత్యువాత పడ్డారు కూడా. చాలా మంది కోలకుని బయటపడ్డారు. అయినా ఇంకా కలవరం ఏమాత్రం తగ్గడం లేదు.

ఇదిలా వుంటే “ఇదీ నా కోవిడ్ లుక్!“ అంటూ శ్రీయా శరన్ పరాచికమాడడం బోయ్స్ కి షాకిస్తోంది. కోవిడ్ అంటుకుంటే చిల్లౌట్ అంటోంది. వర్చువల్ వీడియో సమావేశాలకు సిద్ధంగా ఉన్నానంటోంది. అసలేంటి కథా! అంటూ గుసగుసలు వేడెక్కిపోతున్నాయ్. లఘు చిత్రాలలో చిల్లింగ్ ..చేస్తోందట. మేకప్ .. హెయిర్ రెడీ అని చెబుతోంది. ఇప్పుడు నిజమైన వ్యక్తులను కలవడానికి నిజమైన సమావేశాల కోసం వేచి ఉన్నాను. మీకు వర్చువల్ కౌగిలింతలను పంపుతున్నాను… అంటూ శ్రీయా శరన్ సోషల్ మీడియా ఇన్ స్టా వేదికగా పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.

కోవిడ్ అంటుకుంటే చిలౌట్ చేస్తావేంటి శ్రియా? అసలు నీకు భయం అన్నదే లేదా? అని నెటిజన్స్ శ్రియని కామెంట్ చేస్తున్నారు. శ్రియ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ తో పాటు ఐదు భాషల్లో విడుదల కానున్న `గమనం`లో నటిస్తోంది. వీటితో పాటు తమిళంలో చేస్తున్న `నరగాసురన్` విడుదల కావాల్సి వుంది.