ఆదివారం తేలనుంది: సుశాంత్ ది హత్యా? ఆత్మహత్యా?

0

సుశాంత్ సింగ్ మరణం వెనుకున్న మిస్టరీని ఇప్పటికీ ముంబై పోలీసులు కానీ.. అటు సీబీఐ కానీ తేల్చలేకపోయింది. సుశాంత్ ది ఆత్మహత్య హత్యనా అన్నది తేలకపోవడంతో ఆయన మరణం చుట్టూ దేశ రాజకీయాలే షేక్ అవుతున్నాయి. శివసేన సర్కార్ అభాసుపాలవుతోంది. బాలీవుడ్ నటి కంగనా నిప్పులు చెరుగుతోంది.

ఈ క్రమంలోనే సుశాంత్ సింగ్ మరణం ఆత్మహత్యనా? లేక హత్య అనే దానిపై ఎయిమ్స్ వైద్యుల ప్యానెల్ విచారణ సెప్టెంబర్ 22 ఆదివారం ముగియనుందని జాతీయ మీడియా పేర్కొంది.

డాక్టర్ సుధీర్ గుప్తా నేతృత్వంలోని ఎయిమ్స్ వైద్యుల ప్యానల్ ఆదివారం సమావేశం కానుంది. సుశాంత్ సింగ్ బాడీకి పోస్టుమార్టం నివేదికతోపాటు విసెరా పరీక్షలు చేసిన వైద్యులు తుది నివేదిక ఈ ఆదివారం సమర్పిస్తారు. ఆయన మరణం గురించి తుది అభిప్రాయం చెప్పే అవకాశం ఉంది.

సుశాంత్ సింగ్ మరణానికి ముందు విషం ఇచ్చారా? లేదా అనే విషయాన్ని ఎయిమ్స్ వైద్యులు నిర్ధారిస్తారని అంటున్నారు. ప్రస్తుం ముంబైలోని ఫోరెన్సిక్ ల్యాబ్ లో సుశాంత్ 20శాతం విసెరా ఆధారంగా ఫోరెన్సిక్ నిపుణులు ఒక నివేదికను రెడీ చేస్తున్నారు.