ఐరా ట్రైలర్ టాక్

0

సౌత్ లో లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ సాధించిన నయనతార కొత్త సినిమా ‘ఐరా’ ట్రైలర్ కాసేపటి క్రితం విడుదలైంది. ‘ఎచ్చరికై’ తమిళ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు సర్జున్ కేఎం డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ లో నయన్ డబల్ రోల్ లో నటించింది. భవాని అనే జర్నలిస్ట్ పాత్రలోనూ.. యమున అనే దెయ్యం పాత్రలోనూ నటించింది. ఈ సినిమాలో కలైఅరసన్.. కమెడియన్ యోగిబాబులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.

“ఇప్పుడున్న ఇంటర్నెట్ సినారియోలో కాంట్రవర్షియల్ గా కంటెంట్ ఉంటేనే ఆడియన్స్ చూస్తారు. సూపర్ గా ఉన్న సినిమాను డబ్బా అనాలి.. పీఎం ను తిట్టాలి. జరిగే అన్నిటికీ కారణం ఇల్యూమినాటి అనాలి” అంటూ మామూలు ఐడియాలు వర్క్ అవుట్ కావని.. భవాని ఒక క్రేజీ ఐడియా చెప్తుంది యోగిబాబుకు. కాన్సెప్ట్ ఏంటంటే ‘లైవ్ ఘోస్ట్ ఎక్స్ పీరియెన్స్’. ఒక ఇంట్లో నయన్ టీమ్ ఉంటుంది. ఆ ఇంట్లో వారితో పాటు ఒక దెయ్యం ఉంటుందని నమ్మించి వీడియో షూట్ చేసి యూట్యూబ్ లో పెట్టాలనేది నయన్ ప్లాన్. ఐడియా సూపర్. ఆ ఒక్క ఐడియా భవాని జీవితాన్ని మార్చేస్తుంది. ఎందుకంటే ఆ కొంపలో నిజంగానే దెయ్యం ఉంటుంది కాబట్టి. తన ఫ్లాష్ బ్యాక్ కు సంబంధించి ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధంగా ఉంటుంది సదరు రివెంజ్ దెయ్యం..!

ఇంకేముంది చెప్పండి.. హర్రర్ స్టార్ట్. ఆ దెయ్యం కథ ఏంటి.. డబల్ రోల్ ఎందుకు? ఆ దెయ్యం బారినుండి వీళ్ళు ఎలా బయటపడ్డారు అనేది స్టొరీ. ట్రైలర్ మాత్రం సినిమాపై ఆసక్తి రేకేత్తించేదిగా ఉంది. సుదర్శన్ శ్రీనివాసన్ ఛాయాగ్రహణం.. సుందరమూర్తి నేపథ్య సంగీతం సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్ళేలా ఉన్నాయి. ఫ్లాష్ బ్యాక్ లో పల్లెటూరి అమ్మాయి యమున పాత్రలో నలుపు మేనిఛాయలో నయన్ డిఫరెంట్ గా ఉంది. ట్రైలర్ చూస్తుంటే నయన్ మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ సాధించేలానే ఉంది. మరి ఆ ఇంట్రెస్టింగ్ లైవ్ ఘోస్ట్ ఎక్స్ పీరియెన్స్ మీరు ఒకసారి చూసి తరించండి.
Please Read Disclaimer