కరోనాను జయించిన ఐశ్వర్య రాయ్ ఆరాధ్య

0

బాలీవుడ్ లెజండరీ నటుడు అమితాబ్ బచ్చన్ కుటుంబాన్ని కరోనా ఆవహించింది. ఆయన భార్య జయ బచ్చన్ మినహా బచ్చన్ కుటుంబం మొత్తం కరోనావైరస్ పాజిటివ్ గా తేలింది. అమితాబ్ బచ్చన్.. అభిషేక్ బచ్చన్ ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేరారు. ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నారు.

ఇక మొదట్లో ఐశ్వర్య రాయ్ బచ్చన్.. ఆరాధ్యకు తేలికపాటి లక్షణాలు కనిపించడంతో హోంక్వారంటైన్ లోనే ఉన్నారు. తరువాత వ్యాధి తీవ్రమైంది. జూలై 17న వారిని నానావతి ఆసుపత్రులలో చేర్పించారు. ఐష్.. ఆరాధ్యలకు ఇన్ని రోజుల చికిత్స తరువాత ఈ రోజు నెగటివ్ గా పరీక్షించి ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేస్తారు. ఈ వార్తలను ప్రపంచానికి తెలియజేయడానికి అభిషేక్ బచ్చన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.

అమితాబ్ అభిషేక్ వైద్యుల సంరక్షణలో ఆసుపత్రిలోనే ఉంటారని అభిషేక్ తెలిపారు. వారు చాలా బాగా చికిత్స నందిస్తున్నారని త్వరలో డిశ్చార్జ్ అవుతామని వివరించారు. “మీ నిరంతర ప్రార్థనలు మరియు శుభాకాంక్షలకు ధన్యవాదాలు. ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఐశ్వర్య ఆరాధ్యలకు నెగెటివ్ గా పరీక్షల్లో తేలడంతో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. వారు ఇప్పుడు ఇంట్లో ఉంటారు. నా తండ్రి అమితాబ్ నేను వైద్య సిబ్బంది సంరక్షణలో ఆసుపత్రిలోనే ఉన్నాము ”అని అభిషేక్ బచ్చన్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.

Thank you all for your continued prayers and good wishes. Indebted forever.