46 వయసులో ఇంకా అదే సమ్మోహనం

0

మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్ కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ తెలిసిందే. ఐష్ తర్వాత మళ్లీ అంతటి అందగత్తె పుట్టలేదన్నది అభిమానుల వాదన. తన తర్వాత అందాల రాణిగా కిరీటం గెలుచుకుని వారసురాలు ఆరాధ్య మళ్లీ ఆ లెగసీని కాపాడుతుందా లేదా? అన్నది అటుంచితే ఇప్పటికీ ఐష్ తన అందచందాల్ని కాపాడుకుంటూ ఫాలోయింగ్ ని ఏమాత్రం తగ్గకుండా కాపాడుకోవడం ఆశ్చర్యం కలిగించక మానదు.

నేడు ఐశ్వర్యారాయ్ 46 వ బర్త్ డే ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా అంతర్జాలంలో ఐష్ ఫోటోలు సహా కుటుంబ సమేతంగా ఉన్న ఫోటోల్ని అభిమానులు షేర్ చేస్తూ శుభాకాంక్షలు చెబుతున్నారు. తాజాగా భర్త అభిషేక్ బచ్చన్ ఓ ఫోటోని షేర్ చేసి తనకు ఎంతో స్పెషల్ గా శుభాకాంక్షలు తెలిపాడు. ఆ ఇద్దరూ ప్రస్తుతం రోమ్ లో వెకేషన్ లో ఉన్నారు. ఇక అభి ఫోటో షేర్ చేయడమే గాక.. `హ్యాపి బర్త్ డే ప్రిన్సీపెస్పా!` అంటూ పొగిడేశాడు. ప్రిన్సెస్ కి ఇది ఇటాలియన్ స్టైల్ పదం.

అభిషేక్ షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఐశ్వర్యారాయ్ వైట్ అండ్ పింక్ కలువ తరహాలో ఉన్న ఓ డిజైనర్ గౌన్ లో దర్శనమిచ్చింది. చాలా పొడవుగా ఉన్న ఈ గౌన్ ఎంతో ఆకర్షణీయంగానూ ఉంది. హబ్బీ పొగిడేసినట్టే ఐష్ ప్రిన్సెస్ ని తలపిస్తోంది. అన్నట్టు ఐష్ బాలీవుడ్ లో కెరీర్ పరంగా ఎలాంటి ప్రయత్నాలు చేస్తోంది? అన్నది ఇటీవల రివీల్ కాలేదు. కంబ్యాక్ కోసం చాలా ట్రై చేసినా ఎందుకనో లక్ కలిసి రాలేదు.
Please Read Disclaimer