46లోనూ వన్నెతరగని ఐశ్వర్యం

0

రెండు దశాబ్ధాల క్రితం ప్రపంచ సుందరిగా కీరీటం గెలుచుకున్న ఐశ్వర్యారాయ్ ని అందానికి ఏకైక చిరునామాగా భావిస్తారు అభిమానులు. ప్రపంచసుందరిగా కిరీటం గెలుచుకుని దేశ గౌరవాన్ని పెంచిన ఐష్.. బాలీవుడ్ లో అగ్ర కథానాయికగా రెండు దశాబ్ధాల పాటు కొనసాగిన సంగతి తెలిసిందే. కేన్స్ అంతర్జాతీయ ఫిలింఫెస్టివల్ జూరీ మెంబర్ అయిన తొలి భారతీయ కథానాయికగానూ సుపరిచితం.

బిగ్ బి ఇంట కోడలిగా అడుగు పెట్టి.. అభిషేక్ బచ్చన్ భార్యగా.. ఆరాధ్యకు తల్లిగా ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తూనే తదుపరి కెరీర్ ని సాగించేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. తనని వెండితెరకు పరిచయం చేసిన లెజెండరీ మణిరత్నం దర్శకత్వంలో `పొన్నియిన్ సెల్వన్` అనే చిత్రంలో నటించేందుకు అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ భారీ మల్టీస్టారర్ పాత్రధారుల వివరాలు ఇప్పటికే రివీలయ్యాయి. ఈ చిత్రంలో ఐష్ ఓ నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు.

మరోవైపు ఐష్ కార్పొరెట్ ప్రకటనల బిజీ.. ఫ్యాషన్ ఈవెంట్ల సందడి గురించి తెలిసిందే. ప్రస్తుతం ముంబైలో పర్యటిస్తున్న కేటీపెర్రీని కలిసేందుకు కరణ్ జోహార్ పార్టీకి విచ్చేసిన ఐష్ తన వన్నె తరగని అందంతో హాలీవుడ్ పాప్ స్టార్ నే మురిపించింది. ఇక అటు ఫ్యామిలీ లైఫ్ ని దేశ విదేశీ పర్యటనల్ని మ్యానేజ్ చేస్తూనే.. ఇటు ఫోటోషూట్లతో సామాజిక మాధ్యమాల్లోనూ ఐష్ తన అభిమానులకు టచ్ లో ఉన్నారు. రకరకాల మ్యాగజైన్ కవర్ షూట్లతోనూ ఐష్ బిజీబిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 46 ఏజ్ వచ్చినా.. ఇంకా అదే అందం. ఆ ఒంపుసొంపుల రూపలావణ్యంతో యూత్ ని కట్టి పడేస్తోంది. తాజాగా రివీలైన ఓ ఫోటోలో ఐష్ ఎప్పటిలానే తళుకుబెళుకులతో ఆకట్టుకుంది. వయోలట్ కలర్ డిజైనర్ గౌన్ లో ఐష్ నెమలి సొగసు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
Please Read Disclaimer