రెడ్ హాట్ ఐశ్వర్యం.. 45లో ఇంతందమా

0

`అందం` మీనింగ్ `ఐశ్వర్యా రాయ్`. ఆ వన్నె తరగని అందానికి ప్రపంచవ్యాప్తంగా వీరాభిమానులు ఉన్నారు. రెండు దశాబ్ధాల క్రితం ప్రపంచ సుందరిగా కీరీటం గెలుచుకున్న ఐశ్వర్యా రాయ్ జీవితంలో ఎన్నో పార్శ్చాల్ని తరచి చూస్తే ఎంతో అందంగా ఉంటాయి. సక్సెస్ అన్న పదానికి ఐష్ చిరునామా అంటే అతిశయోక్తి కాదు. భారతదేశంలో ఎదురే లేని అగ్ర కథానాయికగా రెండు దశాబ్ధాల పాటు కొనసాగిన మేటి ప్రతిభావని. కేన్స్ అంతర్జాతీయ ఫిలింఫెస్టివల్ జూరీ మెంబర్ అయిన తొలి భారతీయ కథానాయికగా చరిత్ర సృష్టించారు.

నవతరం కథానాయికల వెల్లువ ఎంతగా ఉన్నా నేటికీ ఐశ్వర్యారాయ్ కి ఉన్న ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. అభిషేక్ బచ్చన్ భార్యగా.. ఆరాధ్యకు తల్లిగా ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తూనే కథానాయికగా నటించేందుకు సంతకాలు చేస్తున్నారు. నటించేందుకు ఏదీ అడ్డుగోడగా నిలవదని ప్రూవ్ చేస్తున్నారు. ప్రస్తుతం తనని వెండితెరకు పరిచయం చేసిన గురూజీ.. లెజెండ్ మణిరత్నం దర్శకత్వంలో `పొన్నియిన్ సెల్వన్` అనే చిత్రంలో నటించేందుకు అంగీకరించడం అభిమానుల్లో చర్చకు వచ్చింది.

మరోవైపు నిరంతరం ఫోటోషూట్లతో సామాజిక మాధ్యమాల్లోనూ ఐష్ తన అభిమానులకు టచ్ లో ఉన్నారు. తాజాగా ప్రపంచ విఖ్యాత పీకాక్ మ్యాగజైన్ కోసం ఐశ్వర్యా రాయ్ ఇచ్చిన ఫోజులు నెటిజనుల్లో వైరల్ గా మారాయి. భారీతనంతో డిజైన్ చేసిన రెడ్ డ్రమటిక్ ఫెదర్ గౌన్ లో ఐష్ మునుపెన్నడూ కనిపించనంత ప్రత్యేకంగా దర్శనమిచ్చారు. 45 వయసులోనూ ఇంతందమా? అంటూ అభిమానులు షాక్ కి గురవుతున్నారు. పీకాక్ మ్యాగజైన్ ఫస్ట్ ప్రింట్ ఎడిషన్ కి సంబంధించిన ఫోటోషూట్ నుంచి బయటకు వచ్చిన తొలి ఫోటో ఇది. న్యూయార్క్ వీధుల్లోని ఓ అందమైన లొకేషన్ లో ఇలా నిచ్చెన (ల్యాడర్) ఆధారంగా ఆ పొడవాటి డ్రెస్ ని ఎలివేట్ చేస్తున్న దృశ్యం కనిపిస్తోంది.
Please Read Disclaimer