తన గర్భం గురించి ఐష్ క్లారిటీ

0

మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్ రెండో సారి తల్లి కాబోతోందన్న వార్తలు నిన్న మీడియాను కుదిపేశాయి. ఎనిమిదేళ్ల గ్యాప్ తర్వాత బచ్చన్ దంపతులు మరోసారి తల్లితండ్రులు కాబోతున్నారన్న వార్త విని ఇద్దరు అభిమానులు తెగ సంతోషించారు. అయితే దీనికి సంబంధించిన క్లారిటీ ఐష్ నుంచి వచ్చింది. తన అధికార ప్రతినిధి మాట్లాడుతూ ఐశ్వర్య రాయ్ తల్లి కాబోతున్నారన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చేశారు.

గోవా బీచ్ కు వెళ్ళినప్పుడు సరైన యాంగిల్ లో ఫోటో తీయకపోవడం వల్లే ఇలాంటి ప్రచారం జరిగిందని అంతే తప్ప ఐష్ కు అభిషేక్ కు ఇప్పుడు ఎలాంటి ఆలోచనా లేదని స్పష్టంగా చెప్పేశారు. సో అమితాబ్ బచ్చన్ కుటుంబానికో వారసుడు రాబోతున్నాడన్న వార్తలకు చెక్ పడిపోయింది.

సరే ఇదంతా ఓకే కానీ ఐష్ నిజంగానే సెకండ్ ఇష్యూ గురించి ఆలోచించాల్సిన టైం అయితే వచ్చింది. మొదటి సంతానం ఆధ్యాకు ఇప్పటికే ఎనిమిదేళ్ళు దాటేశాయి. ఇప్పుడు రెండో బిడ్డకు వెళ్తే నష్టమేమి లేదు. పైగా ఐష్ కు సెకండ్ ఇన్నింగ్స్ అంతగా అచ్చి రావడం లేదు. చేసిన ఒకటి రెండు సినిమాలు కూడా తీవ్రంగా నిరాశా కలిగించాయి.

సాహిర్ లుధియాన్వి బయోపిక్ ఆధారంగా సంజయ్ లీలా భన్సాలీ తీయబోయే సినిమాలో ఐష్ అభిషేక్ లు కలిసి నటిస్తారన్న వార్త ఎప్పటి నుంచో ఉంది కానీ ఇప్పుడు సల్మాన్ ఖాన్ ఇన్షాఅల్లా తెరమీదకు రావడంతో ఇప్పట్లో ఆ ప్రాజెక్ట్ లేనట్టే. ఇది కాకుండా ఐశ్వర్య రాయ్ తోనే సినిమాలు తీయాలని కంకణం కట్టుకున్న దర్శకులు కూడా పెద్దగా ఎవరూ లేరు.
Please Read Disclaimer