లిప్ లాక్ చేయటానికి అభ్యంతరం లేదని చెప్పింది

0

వెండితెర మీద వెలుగులు చిమ్మే హీరోయిన్లు.. రీల్ లో మెరిసిపోయేందుకు మేకప్ వేసుకోవటం మామూలే. కాకుంటే రియల్ లైఫ్ లోనూ వారి మాటలు మొత్తం మేకప్ తో నిండి ఉంటాయి. అందరూ కాదు కానీ.. కొందరు ఈ కోవలోకే ప్రతి విషయాన్ని ఆచితూచి అన్నట్లు మాట్లాడటమే కాదు.. వారు చెప్పే నిజాలు కంటే కూడా ముందుగా సిద్ధం చేసుకునే మాటల్నే చెబుతుంటారు.

అందుకు భిన్నంగా మరికొందరు హీరోయిన్లు మాత్రం.. ఓపెన్ గా అన్ని చెప్పేస్తారు. మొహమాటానికి గురి కావటం.. అందమైన అబద్ధాలు చెప్పటం లాంటివి అస్సలు చేయరు. మీరేమైనా అడగండి.. నిజాయితీగా చెప్పేస్తా అన్న ధోరణితో ఉంటారు. ఆ కోవకే చెందింది ఐశ్వర్యా రాజేశ్. గ్లామర్ కంటే కూడా గ్రామర్ కు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చే ఈ నటి.. ఇటీవల తెలుగులో వరుస పెట్టి నటిస్తోంది.

పేరుకు హీరోయిన్ అయినా.. గ్లామర్ గురించి అస్సలు పట్టించుకోకుండా..సినిమాలో తన పాత్రను మాత్రమే చూసి ఓకే చెప్పే హీరోయిన్ గా ఆమెను చెప్పాలి. నేను తెల్లగా ఉండను.. అన్న విషయాన్ని కూడా చాలా సింఫుల్ గా ఆమె చెప్పేసే మాటను వింటే.. హీరోయిన్లలో ఇంత రియలిస్టిక్ గా ఉండేవారు ఉంటారా? అన్న భావన కలుగక మానదు. తాజాగా ఆమె విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న వరల్డ్ ఫేమస్ లవ్వర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో నలుగురు హీరోయిన్లు అయితే.. అందులో ఐశ్వర్య ఒకరు. ఈ నెల 14న ఈ సినిమా విడుదల కానుంది.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. మరో ముగ్గురు హీరోయిన్లు ఉన్నా.. తన పాత్రకు ఉండే ప్రాధాన్యతతోనే సినిమాను ఓకే చేసినట్లు చెప్పింది. లిక్ లాక్ గురించి తనకు అభ్యంతరం లదేన్న ఆమె.. తాను నటించిన వడ చెన్నై సినిమాలో నాలుగు లిప్ లాక్ సీన్లను చేసిన విషయాన్ని గుర్తు చేశారు. లిక్ లాక్ సన్నివేశాల్లో నటించటానికి అభ్యంతరం లేదు.. కాకుంటే కథకు అనుగుణంగా అయితే ఓకే. లేకుంటే చేసేది లేదని తెగేసి చెప్పేయటం ఐశ్వర్యకే కుదురుతుందేమో? చాలామంది హీరోయిన్లతో పోలిస్తే.. లిప్ లాక్ మీద ఇంత బోల్డ్ గా మాట్లాడటం ఐశ్వర్యకే సాధ్యమేమో?