Aishwarya Rajesh: టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. నిజానికి మొదట తమిళ తెర బ్లాక్ బ్యూటీగా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది ఈ అందాల సోయగం. ఆ తర్వాత పలు తెలుగు చిత్రాల్లో కూడా ఐశ్వర్య రాజేష్ నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ బ్యూటీ తాజాగా రవితేజతో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది. అయితే, ఇప్పటివరకు తన దగ్గరకు ఎక్కువగా సీరియస్ రోల్స్ ఆఫర్లు మాత్రమే వచ్చాయని, ఇది కొంచెం కష్టంగా అనిపిస్తుందని ఐశ్వర్య రాజేష్ చెబుతుంది.
ఇప్పుడు చేస్తున్న మూడు తెలుగు సినిమాల్లోనూ తన పాత్రలు కాస్త సీరియస్ టచ్ లోనే సాగుతాయట. అందుకే ఇలాంటి పాత్రలతో తాను పూర్తి స్థాయిలో సంతోషంగా లేనని ఐశ్వర్య రాజేష్ ఫీల్ అవుతుంది. ఇక నుంచి తనలోని గ్లామరస్ యాంగిల్ ను ఎలివేట్ చేసే పాత్రలకే ఐశ్వర్య రాజేష్ ఎక్కువ మొగ్గు చూపిస్తోందట. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ.. ‘ప్రతీ సారి సీరియస్ పాత్రలు చేసి చేసి అలసిపోయాను.
నా దగ్గరకు వచ్చే డైరెక్టర్లు ఇక నుంచి క్రేజీ, గ్లామరస్ పాత్రలతోనే రావాలి. ఏ.. నేను బికినీ వేయలేనా..?, అవసరం అనుకుంటే బెడ్ సీన్స్ లో కూడా నేను చాలా బాగా నటించగలను. సినిమా కోసం ఏమైనా చేయడానికి నేను రెడీగా ఉన్నాను. అందుకే, ఇప్పటికైనా నా దగ్గరకు అలాంటి పాత్రలతో వస్తారని ఆశిస్తున్నానని తన మనసులో మాటను చెప్పుకొచ్చింది ఐశ్వర్య రాజేష్.
మరి ఐశ్వర్య రాజేష్ కోరుకున్నట్టుగా ఫిల్మ్ మేకర్స్ అలాంటి పాత్రల్లో ఆమెకు అవకాశమిస్తారా..? లేదా ? అనేది చూడాలి. ప్రస్తుతం బాలా డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సూర్య కొత్త సినిమాలో వేశ్య పాత్రలో నటిస్తోంది ఐశ్వర్య రాజేష్. ఈ పాత్ర కోసం ఆమె సెమీ న్యూడ్ గా కూడా నటించబోతుంది. మొత్తానికి ఎక్స్ పోజింగ్ పై ఈ తెలుగు బ్లాక్ బ్యూటీ బాగా ప్రేమను పెంచుకుంది.
ఇన్నాళ్లు ఐశ్వర్య రాజేష్ కి తెలుగులో మెయిన్ హీరోయిన్ గా సరైన అవకాశాలు రాలేదు. కనీసం సెకెండ్ హీరోయిన్ గానో కూడా ఆమెకు మంచి సినిమాలు రాలేదు. సైడ్ పాత్రలకు, సింపతి పాత్రలకు మాత్రమే ఆమె పరిమితం అయింది. ‘రిపబ్లిక్’ లాంటి సినిమాలో మెయిన్ హీరోయిన్ గా కనిపించినా.. సక్సెస్ రాలేదు. కనీసం గ్లామరస్ రోల్స్ చేసైనా సరే.. స్టార్ హీరోయిన్ కావాలని ఆశిద్దాం.
Note : Your feedback is important to us. please let us know whether you LIKE the content or not. request not to post any abuse comments or feedback.