‘ఇండియన్ 2’ నుండి తప్పుకుందట!

0

కమల్ హాసన్ శంకర్ ల కాంబినేషన్ లో 23 ఏళ్ల క్రితం వచ్చిన ‘భారతీయుడు’ చిత్రంకు ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. చాలా ఏళ్ల క్రితమే శంకర్ ఈ చిత్రంకు కథను సిద్దం చేశాడు. అయితే సినిమా ప్రారంభం అయ్యేందుకు చాలా సమయం పట్టింది. కమల్ హాసన్ మరియు శంకర్ లు ఎట్టకేలకు ఈ సీక్వెల్ కు ముందుకు వచ్చారు. సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయ్యింది. కాని ఏదో ఒక అవాంతరం కారణంగా షూటింగ్ ఆలస్యం అవుతోంది. ఈ కారణంగా పలువురు నటీనటులు ఈ చిత్రం నుండి తప్పుకుంటున్నట్లుగా వార్తలు వచ్చాయి.

మొదట షూటింగ్ ఆలస్యం అవుతున్న కారణంగా కాజల్ తప్పుకున్నట్లుగా పుకార్లు షికార్లు చేశాయి. కాని ఆ వార్తలు నిజం కాదని తేలిపోయింది. కాజల్ స్వయంగా మీడియా ముందుకు వచ్చి ‘భారతీయుడు 2’ చిత్రం నుండి తప్పుకున్నట్లుగా వచ్చిన వార్తలను కొట్టి పారేసింది. ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ ఈ చిత్రం నుండి తప్పుకున్నట్లుగా సమాచారం అందుతోంది. తమిళంలో ఐశ్వర్య రాజేష్ చాలా బిజీ హీరోయిన్. ప్రస్తుతం ఆమె చేతిలో డజను సినిమాలకు పైగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో భారతీయుడు 2 కోసం బల్క్ డేట్లు ఇవ్వలేనంటూ ఐశ్వర్య సారీ చెప్పి తప్పుకున్నట్లుగా తమిళ మీడియా వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

ఈమె తెలుగులో విజయ్ దేవరకొండతో కలిసి క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఒక చిత్రంలో నటిస్తోంది. అలాగే ఈ వారంలో ‘కౌశల్య కృష్ణమూర్తి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఈ అమ్మడు పలకరించనుంది. తమిళంలో కూడా ఈమె నటించిన ఒక చిత్రం అతి త్వరలో విడుదల కాబోతుంది. మరో వైపు డజను చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇన్ని సినిమాలు చేతిలో ఉన్న కారణంగా ఇండియన్ 2 చిత్రంను ఆమె వదిలేసినట్లుగా చెబుతున్నారు. ఐశ్వర్య రాజేష్ స్థానంలో రకుల్ ప్రీత్ సింగ్ ను తీసుకునే అవకాశాలున్నాయి. ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Please Read Disclaimer