దేశంలో మూడో కారు ఆ బాలీవుడ్ హీరోదేనట

0

ఖరీదైన కార్లను కొనే సినీ నటులు ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు. అయితే.. అలాంటి వారందరికి అసూయ పుట్టించే కారును తాజాగా కొనుగోలు చేశారు బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్. తాజాగా అతగాడు కొన్న కారు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. ఇండస్ట్రీ లోపలా.. బయటా ఇప్పుడు కొత్త చర్చకు తెర తీసింది.

ఎందుకిలా అంటే.. ఆ హీరో కొన్న కారులాంటివి దేశంలో మరో రెండు మాత్రమే ఉన్నాయట. ఇంతకీ ఆ బాలీవుడ్ స్టార్ హీరో ఎవరో కాదు.. అజయ్ దేవగణ్. ఇంతకూ అతగాడు కొన్న కారు విశేషాల్లోకి వెళితే.. ప్రఖ్యాత రోల్స్ రాయస్ కు చెందిన ఖరీదైన కలినన్ యూఎస్ వీ మోడల్ కారను కొన్నాడు. ఆ కారు ధర జస్ట్ రూ.6.95 కోట్లు మాత్రమేనట.

ఇంత ఖరీదైన కారు దేశంలో ఇప్పటివరకూ రెండు మాత్రమే ఉన్నాయట. ఒక కారు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ వద్ద ఉంటే.. మరొకటి టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ వద్ద ఉందని.. ఇప్పుడు మూడోకారు అజయ్ దేవగణ్ వద్ద ఉందన్నారు. అజయ్ దేవగణ్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే బాలీవుడ్ హీరోలకు మించి కొనుగోలు చేసిన కారు ఇప్పుడు అందరూ ఆయన గురించి మాట్లాడేలా చేసిందని చెప్పాలి.
Please Read Disclaimer