ఛీ.. లో దుస్తుల్లో గుడికి వెళ్లిన స్టార్ హీరో కూతురు

0

బాలీవుడ్ స్టార్ నటుడు అజయ్ దేవగణ్ కూతురు నైసా చిన్న వయసులోనే ఎంతో పాపులారిటీ దక్కించుకుంది. ఆమె వయసు 17 ఏళ్లు. నైసా వేసుకునే దుస్తులు, మేకప్ వల్ల సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతుంటుంది. తాజాగా నైసా గుడికి వేసుకున్న దుస్తులపై బాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. గురువారం నైసా తన తండ్రితో కలిసి ముంబయిలోని ఓ ఆలయానికి వెళ్లింది. సాధారణంగా సామాన్యులైనా, సినీ ప్రముఖులైనా గుడికి వెళ్లేటప్పుడు కాస్త సంప్రదాయమైన దుస్తులు వేసుకుని వెళుతుంటారు. అయితే నైసా మాత్రం ఏకంగా లో దుస్తులు వేసుకుని గుడికి వెళ్లింది.

లోపల వేసుకునే క్రాప్ టాప్ వేసుకుని ఆలయానికి వెళ్లడంతో నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. గుడికి ఎలాంటి దుస్తులు వేసుకోవాలో తెలీదా అంటూ వల్గర్ కామెంట్స్ పెడుతున్నారు. అయితే గుడికి వెళ్లేటప్పుడు చాలా మంది మహిళలు చీరలు కట్టుకుంటూ ఉంటారని, చీర కట్టుకున్నప్పుడు నడుం కనిపించడంలో తప్పు లేనప్పుడు ఆమె భుజాలు కనపడటంలో తప్పేముందని మరికొందరు నైసాకు మద్దతు తెలుపుతున్నారు.

తన పిల్లల జోలికి రావొద్దని అజయ్ ఎప్పుడో నెటిజన్లకు వార్నింగ్ ఇచ్చారు. తన పిల్లలు ఇద్దరూ ఇంకా చిన్నవారేనని, కావాలంటే తనను, కాజోల్‌ను ఏమైనా అనండి కానీ తన పిల్లల జోలికి మాత్రం రావద్దని తెలిపారు. గతంలోనూ నైసా తొడల వరకు ఉన్న స్వెటర్ వేసుకుని ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లడం వైరల్ అయింది. దాంతో ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా అని నెటిజన్లు ఆమె ఫొటోలను షేర్ చేస్తూ ఎగతాళి చేశారు. అలా చాలా సార్లు నైసా వార్తల్లో నిలిచింది. కానీ ఎప్పుడూ మీడియా ముందు పల్లెత్తి మాట అనలేదు. ఎవరేమనుకుంటే నాకేంటి అనుకుని తన పని తాను చూసుకుంటోంది.
Please Read Disclaimer