హమ్మయ్య.. ఎట్టకేలకు లుక్ మార్చిన స్టార్ హీరో

0

ఆరు పదుల వయసు దాటిన హీరోలు కూడా కుర్ర హీరోల తరహాలో కాస్ట్యూమ్స్ ధరించి.. కర్లీ హెయిర్ తో కుర్ర లుక్ కు ప్రయత్నిస్తున్నారు. కాని తమిళ స్టార్ హీరో అజిత్ మాత్రం సహజత్వం అంటూ నెరిసిన గడ్డం మరియు తెల్ల జట్టుతో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఆయన ఫ్యాన్స్ కొన్నాళ్లు ఆ లుక్ ను ఎంజాయ్ చేసినా ఇప్పుడు మాత్రం ఇంకా ఎంతకాలం అన్నట్లుగా అసహనంతో ఉన్నారు. గత ఐదు ఆరు సంవత్సరాలుగా ఒకే తరహా లుక్ తో సినిమాల్లో నటిస్తున్న అజిత్ ఎట్టకేలకు కొత్త లుక్ లో కనిపించబోతున్నాడు.

ఇటీవలే అజిత్ ‘నెర్కొండ పార్వై’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బోణీ కపూర్ నిర్మాణంలో తెరకెక్కిన ఆ చిత్రంలో కూడా అజిత్ సేమ్ లుక్ లోనే కనిపించాడు. ఇప్పుడు బోణీ కపూర్ నిర్మాణంలో వినోద్ దర్శకత్వంలో అజిత్ మరో సినిమాను చేయబోతున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్ టైనర్ గా అజిత్ కొత్త సినిమా ఉండబోతుంది. యూత్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా అజిత్ ను ఈ చిత్రంలో వినోద్ చూపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

అందుకోసం నీట్ షేవ్ తో ఆకట్టుకునే హెయిర్ స్టైల్ తో అజిత్ సిద్దం అయ్యాడు. అజిత్ ఈసారి జట్టుకు రంగు వేయడంతో పాటు గడ్డం కూడా లేకుండా చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. ఎప్పటి నుండో అజిత్ ను ఫ్యాన్స్ ఇలా చూడాలనుకుంటున్నారు. తెల్ల జుట్టు.. తెల్లగడ్డంతో ఆరు పదుల వయసు దాటిన వ్యక్తిగా కనిపించిన అజిత్ ఇప్పుడు పాతికేళ్లు తగ్గి మరీ కనిపించబోతున్నాడు. ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఇప్పటి నుండే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం పేపర్ వర్క్ జరుగుతున్న ఈ సినిమాను త్వరలో ప్రారంభించి వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశ్యంలో దర్శకుడు వినోద్ ఉన్నాడు.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home