మాపై కాదు వారిపై సోదాలు చేయండి : అజిత్

0

ఈమద్య కాలంలో సినిమా తారలు మరియు నిర్మాతలపై ఐటీ సోదాలు వరుసగా జరుగుతున్న విషయం తెల్సిందే. ఇటీవలే రష్మిక మందన్నను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విచారించిన విషయం తెల్సిందే. ఆమెను విచారించి కొన్ని రోజులు అయ్యిందో లేదో అప్పుడే తమిళ స్టార్ హీరో విజయ్ ను బిగిల్ నిర్మాతల లెక్కల విషయంలో రహస్యంగా ప్రశ్నించడం జరిగింది. మాస్టర్ షూటింగ్ లో ఉన్న సమయంలో విజయ్ ను తీసుకు వెళ్లి ప్రశ్నించడం తమిళ సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.

ముందుగా నోటీసులు ఇచ్చి ఆ తర్వాత కొన్ని రోజులు టైం ఇచ్చి అప్పుడు విచారణకు పిలవాల్సి ఉంటుంది. కాని విజయ్ ను మాత్రం షూటింగ్ స్పాట్ కు వెళ్లి షూటింగ్ నిలిపేయించి మరీ తీసుకు వెళ్లి ప్రశ్నించడం ఏంటంటూ ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల వారు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయమై తమిళ స్టార్ అజిత్ స్పందించాడు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అన్నింటికి రేట్లు పెంచేసి.. పన్నులు భారీగా పెంచేసి సెలబ్రెటీలు ఏదో తప్పు చేసినట్లుగా వారి ఇళ్లలో సోదాలు చేయడం.. మమ్ములను ప్రశ్నించడం చేస్తారా. ప్రజల సొమ్ము దోచుకుంటున్నది సెలబ్రెటీలు కాదు రాజకీయ నాయకులు. వారి ఇళ్లలో సోదాలు నిర్వహిస్తే దేశంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయంటూ అజిత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అజిత్ వ్యాఖ్యలు అందరు హీరోల ఫ్యాన్స్ షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.
Please Read Disclaimer