అది ఫేక్ ప్రెస్ నోట్ అజిత్ కు అవి ఇష్టం ఉండవు

0

ఈమద్య కాలంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు సోషల్ మీడియాను విపరీతంగా వాడేస్తున్నారు. కాని కొందరు స్టార్స్ మాత్రం సోషల్ మీడియా పట్ల దూరంను మెయింటెన్ చేస్తున్నారు. అందులో ప్రధముడు తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్క సోషల్ మీడియా అకౌంట్ కూడా లేకుండానే అజిత్ ఇన్నాళ్లు ఉన్నాడు. ఇకపై కూడా ఉంటాడు. కాని ఇటీవల ఆయన పేరుతో వచ్చిన ఒక ప్రెస్ నోట్ అందరి దృష్టిని ఆకర్షించింది.

అజిత్ లెటర్ హెడ్ పై ఆయన సంతకంతో వచ్చిన లెటర్ లో తాను త్వరలో సోషల్ మీడియాలో ఎంటర్ అవ్వబోతున్నాను అంటూ ప్రకటించాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని అందులో చెప్పాడు. ఇకపై తన సినిమాల గురించి మరియు వ్యక్తిగత విషయాల గురించి కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను అంటూ చెప్పుకొచ్చాడు. ఆ లేఖతో అజిత్ అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. కాని అది ఫేక్ అంటూ అజిత్ పీఆర్ టీం ప్రకటించింది.

అజిత్ కు సోషల్ మీడియా అంటే అస్సలు ఇష్టం ఉండదని.. అందులోకి ఎంటర్ అయ్యేందుకు ఆయన ఆసక్తి చూపడం లేదని చెప్పుకొచ్చారు. మీడియాలో ప్రసారం అవుతున్న ఆ లెటర్ మరియు సిగ్నేచర్ అన్ని కూడా ఫేక్ అన్నారు. అజిత్ కు సింపుల్ గా జీవించడం ఇష్టం. సోసల్ మీడియాలో తనకు సంబంధించిన విషయాలను షేర్ చేయాలనుకోవడం లేదన్నాడు. ఇక ఫ్యాన్ సోషల్ మీడియా పేజీలను కూడా అజిత్ సపోర్ట్ చేయడం లేదని వారు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో అజిత్ పేరుతో ఉన్న అకౌంట్స్ కు అజిత్ కు అస్సలు సంబంధం లేదని వారు క్లారిటీ ఇచ్చారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-