అంత యాక్షన్ లో కూడా ఆకాంక్ష గ్లామర్ హైలైట్!

0

కోలీవుడ్ హీరో విశాల్ నటించిన కొత్త సినిమా ‘యాక్షన్’ ఈ శుక్రవారమే విడుదలైంది. ఈ సినిమాలో విశాల్ సరసన తమన్నా భాటియా హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. విశాల్ సినిమాలంటే మొదటి నుంచి యాక్షన్ కు పెట్టింది పేరు. ఈ సినిమాకు ఏకంగా పెట్టడమే ‘యాక్షన్’ అనే పేరు పెట్టారు కాబట్టి యాక్షన్ ను దంచుకున్నారు. సినిమా ఎలా ఉంది అనేది పక్కన పెడితే ఇంత యాక్షన్ లో కూడా తమన్నా గ్లామర్ తో పాటుగా మరో భామ గ్లామర్ ఈ సినిమాకు హైలైట్ గా మారింది.

ఈ సినిమాలో హాట్ బ్యూటీ ఆకాంక్ష పూరి నెగెటివ్ పాత్రలో నటించింది. ఎప్పుడైనా.. ఏ సినిమాలో అయినా లేడీ విలన్ పాత్ర ప్రేక్షకులను వెంటనే ఆకర్షిస్తుంది. రొటీన్ కు భిన్నంగా ఉంటుంది కాబట్టి ప్రేక్షకులకు ఆ పాత్ర కొంచెం కనెక్ట్ అయినా ఆ నటికి మంచి పేరు వస్తుంది. ఈసారి ‘యాక్షన్’ విషయంలో కూడా అలానే జరిగింది. ఈ ఆకాంక్ష అటు యాక్షన్ సీన్లు.. ఇటు గ్లామర్ షో రెండిటికి సమన్యాయం చేసి ప్రేక్షకులను ఆకర్షించింది. ఈ భామ తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేదు కానీ తమిళ.. కన్నడ.. మలయాళం భాషలలో ఇప్పటికే సినిమాలు చేసింది. ఇక సోషల్ మీడియా హాటు షోలలో కూడా దిట్ట. అందుకే ఈ సినిమాను చూసిన కళాపోషకులు ఈ పాప ఫ్రీక్వెన్సీకి ఫుల్లుగా కనెక్ట్ అవుతున్నారట.

అంతటితో ఆగకుండా ఆకాంక్ష సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవుతున్నారట. మరి ‘యాక్షన్’ సినిమాను చూసిన ప్రేక్షకులను ఇంతగా ఆకర్షిస్తున్న ఈ భామ మన తెలుగు ఫిలిం మేకర్లను కూడా ఆపరేషన్ ఆకర్ష్ అంటుందా.. వారు ఈ ఆకర్షణకు లోనయ్యి ఆఫర్లు ఇస్తారా.. ఏం జరుగుతుందో వేచి చూడాలి.
Please Read Disclaimer