జైపూర్ భామ ఝకాస్ పోజు

0

ఆకాంక్ష సింగ్ తెలుసా? ఈ జైపూర్ భామ సుమంత్ సినిమా ‘మళ్ళీ రావా’ తో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. నాగార్జున.. నాని మల్టి స్టారర్ ‘దేవదాస్’ లో కూడా రిపోర్టర్ పాత్రలో నటించింది. ఈ భామ సినిమాల్లో ఎంట్రీ ఇవ్వక మునుపు హిందీ టీవీ షోలలో బుల్లితెరపై తన సత్తా చాటింది. ఇప్పుడేమో వెండితెరపై సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. పనిలో పనిగా సోషల్ మీడియాలో కూడా సత్తా చాటుతోంది.

ఆకాంక్ష తన ఇన్స్టా ఖాతా ద్వారా కొన్ని ఫోటోలు పోస్ట్ చేసి “మీ యాటిట్యూడ్ అనేది మీ విలువ ఎంతో చూపించే ఒక ప్రైస్ టాగ్ లాంటిది” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. నిజమే కదా మనం లేకిగా ప్రవర్తిస్తే జనాలు మనల్ని లేకి అనుకుంటారు. అవివేకిగా ప్రవర్తిస్తే అవివేకి అనుకుంటారు. మనం నటిస్తే ఎవరూ కనుక్కోరనుకోవడం మన భ్రమ. అందరూ మనలాంటి నటులే కాబట్టి వారికి మన నటన ఇట్టే చిటికెలో తెలిసిపోతుంది. కాబట్టి మన ప్రవర్తనే మనకు విలువను తీసుకొస్తుంది. చీప్ గా ప్రవర్తిస్తే చీప్ అనుకుంటారు. అయినా అంత హాటు భామ.. ఇంత ఘాటు ఫిలాసఫీ ఎందుకు చెప్పిందో ఏంటో..! ఇక ఫోటోల విషయానికి వస్తే ఆకాంక్ష పొట్టిగా ఉండే వైట్ గౌన్ ధరించింది. స్లీవ్స్ మాత్రం పారదర్శకంగా ఉండడంతో డ్రెస్ డిఫరెంట్ గా ఉంది. కళ్ళకేమో కూలింగ్ గ్లాసెస్ ధరించి.. కాళ్ళకేమో వైట్ కలర్ స్పోర్ట్స్ షూతో గ్లామరస్ గా కనిపిస్తోంది.

ఈ ఫోటోలకు నెటిజన్లు ఇంట్రెస్టింగ్ కామెంట్లు పెట్టారు. “నీ యాటిట్యూడ్ వెలకట్టలేనిది”.. “నీ వైట్ డ్రెస్ సూపర్”.. “మోడరన్ ఏంజెల్” అంటూ కొందరు తమ స్పందనలు తెలిపారు. ఆకాంక్ష ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ప్రస్తుతం తమిళంలో ‘క్లాప్’ అనే చిత్రంలో నటిస్తోంది.
Please Read Disclaimer