కొడుకుతో కూడా హీరోయిన్ కి ముద్దులు పెట్టిస్తున్నాడు!

0

పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి మొదట ‘ఆంధ్రాపోరి’ తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత పూరినే స్వీయదర్శకత్వంలో ‘మెహబూబా’ సినిమాతో తనయుడికి బ్రేక్ ఇవ్వాలని ప్రయత్నం చేశారు. అయితే ఆ రెండు సినిమాలు ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఇప్పుడు పూరి బ్యానర్ లో అనిల్ పాడూరి దర్శకత్వంలో ‘రొమాంటిక్’ అనే బోల్డ్ సినిమాతో ఆకాష్ కు బ్రేక్ ఇచ్చే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి.

ఈ సినిమాలో హీరోయిన్ ఉత్తరాది భామ కేతిక శర్మ ఏమాత్రం మొహమాటాలు లేకుండా బోల్డ్ అనే పదం కూడా సిగ్గుపడే తరహాలో నటిస్తూ పూరి క్యాంపుకు తన మద్దతును పూర్తి స్థాయిలో ప్రకటించింది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్లు సోషల్ మీడియాలో కాకరేపుతూ కెవ్వుకేక అనిపిస్తున్నాయి. ఆ కెవ్వుకేకలను నిరాఘాటంగా కొనసాగించేలా కొత్త పోస్టర్లను విడుదల చేస్తూ ‘రొమాంటిక్’ టీమ్ తమ సినిమా టైటిల్ కి సార్థకత చేకూరుస్తోంది. ఈ రోజు విడుదలైన రిలీజ్ డేట్ పోస్టర్ కూడా అదే స్థాయిలో ఉంది. ఒక బస్ ఫుట్ బోర్డ్ పై హీరో హీరోయిన్లు ఇద్దరూ నిలుచుని ఉంటే కేతిక – ఆకాష్ లు ఇద్దరూ ఒక జలేబి.. మలంగ్ స్థాయి కిస్సు ఇచ్చుకుంటూ ప్రేమ లోకంలో ఓలలాడుతున్నారు.

ఈ పోస్టర్లో రొమాన్స్ ఘాటుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరేమో కళాత్మకంగా ఉందని మెచ్చుకుంటూ ఉంటే.. కొందరు మాత్రం విమర్శలు చేస్తున్నారు. పూరి జగన్నాధ్ తన కొడుకుతో కూడా హీరోయిన్ కు ముద్దులు పెట్టిస్తున్నాడని కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ ఘాటు ముద్దులు.. చెరిపేసిన రొమాన్స్ హద్దులు ఆకాష్ కు విజయం అందిస్తాయా అనేది వేచి చూడాలి. ‘రొమాంటిక్’ సినిమా మే 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Please Read Disclaimer