Templates by BIGtheme NET
Home >> Cinema News >> Akhil – Agent : అఖిల్ ‘ఏజెంట్’ మూవీ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్..

Akhil – Agent : అఖిల్ ‘ఏజెంట్’ మూవీ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్..


Akhil – Agent : అక్కినేని మూడో తరం నట వారసుడు అఖిల్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో అఖిల్ సీక్రెట్ ‘రా’ (RAW) రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ ఏజెంట్ పాత్రలో నటించబోతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌కు మూహూర్తం ఫిక్స్ చేసారు.

హీరోగా వరుస పరాజయాల్లో ఉన్న అఖిల్ అక్కినేనికి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో కథానాయకుడిగా తొలి సక్సెస్‌‌‌ను అందుకున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో సాప్ట్ రోల్లో కనిపించిన అఖిల్.. ఇపుడు ఏజెంట్ సినిమా కోసం పూర్తిగా మారిపోయాడు.

ఏజెంట్ (Agent)పేరుతో వస్తున్న ఈ సినిమాకు వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు. ఈ చిత్రాన్నిఏకే ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, సురెండర్2 సినిమా బ్యానర్ పై సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. స్పై థ్రిల్ల‌ర్‌గా వస్తోన్న ఈ చిత్రాన్ని భారీగా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి మరో ముఖ్యపాత్రలో నటిస్తుండంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

తాజాగా ‘ఏజెంట్’ సినిమాకు టీజర్‌కు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ టీజర్‌ను జూలై 15న సాయంత్రం 5.05 నిమిషాలకు విడుదల చేయనున్నారు. విషయం ఏమంటే అఖిల్ ఈ చిత్రానికి రెమ్యున‌రేష‌న్ తీసుకోవ‌డం లేద‌ట. సినిమా క్వాలిటీ ముఖ్యమని.. అందులో భాగంగా ప్రస్తుతం ఆయన ఎటువంటీ రెమ్యూనరేషన్ తీసుకోవట్లేదని అంటున్నారు. అయితే ఈ సినిమాకు వ‌చ్చిన క‌లెక్ష‌న్ల‌లో వాటా తీసుకుంటున్న‌ట్లు టాక్ నడుస్తోంది. అఖిల్ ఈ చిత్రం కోసం కంప్లీట్‌గా మేకోవ‌ర్ అయ్యారు. స్టైలీష్ లుక్‌లో కండ‌లు తిరిగిన దేహంతో సరికొత్తగా కనిపిస్తున్నారు.

ఈ చిత్రంలో అఖిల్ రా ఏజెంట్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అఖిల్‌కు జోడిగా కొత్త అమ్మాయి సాక్షీ వైద్య హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. సంగీతం ఎస్ఎస్ థ‌మ‌న్ అందిస్తున్నారు. మొన్నటి వరకు ఈ సినిమా యూరప్‌లో షూటింగ్ జరుపుకుంది. యూరప్‌లోని హంగేరీ రాజధాని బుడాపెస్ట్ (Budapest )లో షూటింగ్ చేసింది టీమ్. అతుల్య రవి కూడా మరో హీరోయిన్‌గా చేస్తున్నారు.

ఇక అఖిల్ మూవీకి సంబంధించిన తమిళ టీజర్‌ను ప్రముఖ హీరో శివ కార్తికేయన్ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అపీసియల్‌గా ప్రకటించారు.

ఇక ఏజెంట్ మూవీకి సంబంధించిన కన్నడ వెర్షన్‌కు సంబంధించిన టీజర్‌ను కిచ్ఛా సుదీప్ విడుదల చేయనున్నారు. ఈ సినిమాను అన్ని భాషల్లో కలిపి రూ. 60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ థియేట్రికల్ బిజినెస్ చేసినట్టు సమాచారం. మరోవైపు ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులు కూడా భారీ రేటుకు అమ్మడుపోయినట్టు సమాచారం. మొత్తంగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సక్సెస్ తర్వాత ఏజెంట్‌గా వస్తోన్న అఖిల్ ఈ సినిమాతో భారీ సక్సెస్ అందుకుంటారా లేదా అనేది చూడాలి. (Twitter/Photo)