అఖిల్ అక్కినేని సినిమాకి టైటిల్ ఫిక్స్‌!

0

అఖిల్, హ‌ల్లో, మిస్ట‌ర్ మ‌జ్ను చిత్రాలు ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌క‌పోవ‌డంలో ఆలోచ‌న‌లో ప‌డ్డారు అఖిల్ అక్కినేని. ఈ ద‌ఫా డెఫినెట్‌గా హిట్ కొట్టాల‌ని మాంచి క‌సితో వ‌ర్క్ చేస్తున్నారు. ఇందుకు అల్లు కాంపౌండ్ నిర్మాత బ‌న్నీవాసు కూడా తోడ‌వ్వ‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాల‌తో వున్నారు అఖిల్‌. గీతా ఆర్ట్స్ 2 బ్యాన‌ర్‌లో అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

`ఒంగోలు గిత్త‌` త‌రువాత బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ చేస్తున్న ఈ రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ స‌క్సెస్ అన్న‌ది అఖిల్‌తో పాటు ఆయ‌న‌కూ త‌ప్ప‌నిస‌రిగా మారింది. దీంతో చాలా జాగ్ర‌త్తలు తీసుకుని ఓ హిట్ సినిమాకుండే అన్ని క్వాలిటీస్‌తో ఈ చిత్రాన్ని ముస్తాబు చేస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి ఈ నెల 4న టైటిల్‌ని ప్ర‌క‌టించ‌బోతున్నారు. `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌` అనే టైటిల్‌ని ఈ చిత్ర టైటిల్‌. ముందే అనుకున్నా టైటిల్ మ‌రీ ఇంగ్లీష్ అయిపోతుంద‌ని కొంత అనుమానించార‌ట‌.

విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్న `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్` టైటిల్ బ‌య‌టికి రావ‌డం దాన్ని అంద‌రు ఆద‌రించ‌డంతో ఆ అనుమానం పోయింద‌ట‌. దీంతో ముందు అనుకున్న`మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌` అనే టైటిల్‌ని చిత్ర బృందం ఫైన‌ల్ చేసిన‌ట్టు తెలిసింది. ఇదే టైటిల్‌ని ఈ నెల 4న ప్ర‌క‌టించ‌నున్న‌ట్టు చిత్ర వ‌ర్గాల స‌మాచారం.




Please Read Disclaimer