ఎట్టకేలకు అఖిల్ కు సరైన జోడీ దొరికింది

0

అక్కినేని అఖిల్ నాల్గవ సినిమా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న విషయం తెల్సిందే. చాలా గ్యాప్ తర్వాత దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక అఖిల్ ఇప్పటి వరకు నటించిన మూడు సినిమాలు కూడా నిరాశనే మిగిల్చాయి. కమర్షియల్ బ్లాక్ బస్టర్ కోసం చాలా ఆసక్తిగా అఖిల్ మరియు అక్కినేని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అఖిల్ అక్కినేని అభిమానులను వరుసగా నిరాశ పర్చుతున్నాడు. అయితే అఖిల్ 4 మాత్రం తప్పకుండా ఆకట్టుకుంటుందని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు.

ఇక అఖిల్ మొదటి మూడు సినిమాల్లో కూడా హీరోయిన్స్ విషయంలో విమర్శలు ఎదుర్కొన్నారు. అఖిల్ కు సరైన జోడీని వెదకడంలో దర్శకులు విఫలం అయ్యారంటూ విమర్శలు వచ్చాయి. మొదటి హీరోయిన్ నుండి మూడవ సినిమాలో నటించిన నిధి అగర్వాల్ వరకు ముగ్గురికి ముగ్గురు కూడా అఖిల్ కు సరైన జోడీ అనిపించుకోలేదు. అఖిల్ ముందు వారి తేలిపోయినట్లుగా ఉన్నారంటూ అభిప్రాయం వ్యక్తం అయ్యింది. ఇక అఖిల్ 4వ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెల్సిందే.

ఇప్పటి వరకు అఖిల్ 4 కు సంబంధించి ఎలాంటి ఫస్ట్ లుక్ రాలేదు. దాంతో ఇన్ని రోజులుగా అఖిల్ పూజాల జోడీ ఎలా ఉంటుందా అంటూ అక్కినేని ఫ్యాన్స్ ఆందోళన చెందారు. కాని తాజాగా కాకినాడలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు ఇద్దరు కలిసి వెళ్లడంతో అభిమానుల్లో ఉన్న సగం టెన్షన్ తగ్గింది. ఇద్దరు కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోలతో ఇద్దరి జోడీ బాగుందంటూ కామెంట్స్ వస్తున్నాయి. తప్పకుండా అఖిల్ కు ది బెస్ట్ జోడీగా పూజా నిలుస్తుందనే నమ్మకంను ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. ఎట్టకేలకు అఖిల్ కు సరి జోడీ దొరికిందని మరి కొందరు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
Please Read Disclaimer