మొత్తానికి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ విడుదల అప్పుడేనట!

0

తెలుగు ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభం నుంచీ ఇంతవరకు హిట్ అంటే తెలియని హీరోగా వెళ్తున్న అఖిల్ నాలుగో సినిమాగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ రూపొందుతుంది. ఈ సినిమాకు ప్రస్తుతం ప్లాపుల్లో ఉన్న బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా పై అక్కినేని ఫ్యామిలీ అక్కినేని అభిమానులు ఆశలు మాములుగా పెట్టుకోలేదు. వరస ప్లాప్ లలో కూరుకుపోతున్న అఖిల్ ను బొమ్మరిల్లు భాస్కర్ సినిమా ఎంతవరకూ గట్టెక్కిస్తుందా.. అనేది సోషల్ మీడియాలో పెద్ద సవాల్ అయింది. పూర్తి ఫన్ తో ఎమోషన్స్ తో ఈ సినిమాని రూపొందించారని చెప్తున్నారు. అఖిల్ ఈ సినిమాలో మధ్య తరగతి యువకుడిగా కనిపించనున్నారు. గీతా గోవిందం తరహాలో ఇదో రొమాంటిక్ ఎంటర్టైనర్. జీఏ2 పిక్చర్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు వాసు వర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అయితే ఈ సినిమా కరోనా కోరల్లో చిక్కుకొని విడుదల వాయిదా పడుతూ వచ్చింది. సినిమా మొత్తం విడుదలకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం థియేటర్లు తెరుచుకునే పరిస్థితి కనిపించడం లేదు. అందుకని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా యూనిట్.. ఓటిటిలో విడుదల చేస్తారని వార్తలు హల్చల్ చేసాయి. కానీ సినిమా విడుదల పై యూనిట్ స్పందించి ఈ సినిమాను ఎంత ఆలస్యం అయినా థియేటర్లోనే విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్.. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉండగా ఈ సినిమా పై దర్శక నిర్మాతలు చాలా నమ్మకంతో ఉన్నారట. ఇక ఈ సినిమాను ఈ ఏడాది దసరా కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు!
Please Read Disclaimer