బ్యాచిలర్ గా అఖిల్ ఫ్రీలుక్

0

అక్కినేని అఖిల్ 4వ సినిమా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న విషయం తెల్సిందే. ఈ సినిమాకు మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా రెండు మూడు రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా చిత్ర యూనిట్ సభ్యులు ఆ వార్తలను నిజం చేస్తూ ఫస్ట్ లుక్ కు సంబంధించి ఫ్రీ లుక్ ను విడుదల చేశారు. ఇందులో టైటిల్ పై క్లారిటీ ఇవ్వడంతో పాటు అఖిల్ కాళ్లను మాత్రమే చూపించారు.

ఫార్మల్ షూష్ మరియు ఫార్మల్ ప్యాంట్ వేసుకుని ఇంట్రెస్టింగ్ గా అఖిల్ కనిపించబోతున్నట్లుగా ఈ ప్రీ లుక్ తో క్లారిటీ వచ్చేసింది. ఫస్ట్ లుక్ ను ఈనెల 8వ తారీకు సాయంత్రం 6 గంటల 18 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. మోస్ట్ ఎలిజబుల్ అనేది ప్రిఫిక్స్ లా ఉంచి బ్యాచిలర్ అనేది బోల్డ్ అండ్ బిగ్ లెటర్స్ లో పెట్టారు. కనుక ఈ చిత్రంను బ్యాచిలర్ అంటూ పిలవచ్చు.

ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. మరో ముఖ్య పాత్రకు గాను ఈషా రెబ్బాను తీసుకున్నట్లుగా ఇటీవలే వార్తలు వచ్చాయి. బొమ్మరిల్లు స్థాయిలో ఈ చిత్రం ఉండబోతుంది అంటూ మేకర్స్ చాలా నమ్మకంగా చెబుతున్నారు. ఏప్రిల్ లో ఈ చిత్రం విడుదల కాబోతున్నట్లుగా క్లారిటీ ఇచ్చేశారు. ఇక అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని గీతాఆర్ట్స్ 2 బ్యానర్ లో నిర్మిస్తున్న విషయం తెల్సిందే.
Please Read Disclaimer